పవన్ కల్యాణ్‌కు ఇంకా చెప్పలే.. ప్రభాస్, విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్లపై నిహారిక కామెంట్

Recommended Video

Niharika Was The First Choice For That Super Hit Movie | Filmibeat Telugu

కొణిదెల నటవారసురాలు నిహారిక కొణిదెల నటించిన తాజా చిత్రం సూర్యకాంతం. రిలీజ్‌కు ముందే స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా నిహారిక తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను మీడియాతో పంచుకొన్నారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ..

పవన్ కల్యాణ్ స్పీచెస్ ఇన్సిపిరేషన్

పవన్ కల్యాణ్ స్పీచెస్ ఇన్సిపిరేషన్

నాకు పాలిటిక్స్ గురించి తెలియదు. కానీ పవన్ కల్యాణ్ బాబాయ్ ప్రసంగాలు వింటే నాకు చాలా ఇన్సిపిరేషన్‌గా ఉంటాయి. టెలివిజన్‌లో బాబాయ్ మాట్లాడుతుంటే ఇంట్లో అమ్మా నాన్నతో కలిసి చూస్తాను. పవన్ కల్యాణ్ చాలా మితభాషి. ఇంట్లో ఫంక్షన్‌ జరిగితే వస్తే చాలా కామ్‌గా కూర్చొంటాడు.

కామ్‌గా ఉండి.. అందరిపై జోకులు

కామ్‌గా ఉండి.. అందరిపై జోకులు

ఇంట్లో అందరితో కలిసిపోతాడు. మా నాన్న చాలా కామ్‌గా ఉంటాడు. కానీ పవన్ బాబాయ్ మా చిన్న అత్త మీద బాగా జోకులు వేస్తాడు. మా చిన్నత్తను అందరూ ఏడిపిస్తుంటారు. నాతో కూడా పవన్ బాగుంటాడు. నేనేదైనా పిచ్చి పనిచేస్తే నా మీద కూడా జోకులు వేసి ఏడ్పిస్తాడు.

 స్వచ్ఛమైన వ్యక్తి.. స్వార్ధం తెలియదు

స్వచ్ఛమైన వ్యక్తి.. స్వార్ధం తెలియదు

పవన్ కల్యాణ్‌లో చాలా స్వచ్ఛత ఉంటుంది. స్వార్ధం అసలే కనిపించదు. స్టార్ అనే గర్వంగాని, ఆ హోదాను మెయింటెన్ చేయాలని ఎప్పుడు అనుకోడు. అందుకే ఆయన నాకే కాదు.. మా అన్నయ్యలకు కూడా స్ఫూర్తి. ప్రస్తుత రాజకీయాల్లో అంత స్వచ్ఛమైన మనిషి, నిస్వార్థమైన వ్యక్తిని చూడలేదు. నాకు నువ్వు ఇన్సిపిరేషన్ అని పవన్ బాబాయ్‌కి ఇంకా చెప్పలేదు అని నిహారిక అన్నారు.

వరుణ్ తేజ్‌తో అప్పుడు గొడవపడేదాన్ని

వరుణ్ తేజ్‌తో అప్పుడు గొడవపడేదాన్ని

నాకు అన్నయ్య వరుణ్ తేజ్‌తో అప్పట్లో గొడవపడేదాన్ని. అన్నయ్య ఎప్పుడూ బయటకు తీసుకెళ్లకపోయేవాడు. అందుకే నాకు అన్న అంటే కోపం. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్‌తో కలిసి వరుణ్ బయటకు వెళ్లేవాడు. కానీ నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత నన్ను బయటకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు.

ప్రభాస్, విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తల గురించి

ప్రభాస్, విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తల గురించి

ప్రభాస్, విజయ్ దేవరకొండపై పెళ్లి వార్తలు కొంత బాధ పెడుతాయి. నేను ఇప్పటికీ విజయ్ దేవరకొండను కలవలేదు. ప్రభాస్‌ను నేను కలిసిన దాఖలాలు లేవు. అయినా నా గురించి వారితో ముడిపెట్టి వార్తలు రాస్తారు. నా గురించి రాస్తే ఒక వార్త తర్వాత పది వార్తలు రాసుకొనే చాయిస్ ఉంటుంది. మిగితా వారి గురించి రాస్తే పెద్దగా రియాక్షన్ ఉండదు. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని నిహారిక అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X