ఆ బార్‌కు వెళ్లకపోతే లైఫ్ వేస్ట్: వైరల్ అవుతున్న నిహారిక వీడియో
Recommended Video

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా ఇలా అన్ని మాధ్యమాలను కవర్ చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేస్తూ ఉంటారు. తాను ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తుంటారు.
ఇటీవల వైజాగ్ వచ్చిన సందర్భంగా నిహారిక పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడి ఓ బార్ గురించి వెల్లడిస్తూ నిహారిక ఈ పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. బార్ అంటే మద్యం బార్ మాత్రం కాదండోయ్. అసలు వివరాల్లోకి వెళితే..

బార్ నచ్చింది
వైజాగ్‌లో బేకర్స్ కాస్టల్ అనే డెసర్ట్ బార్ ఉంది, ఇక్కడ డెసర్ట్స్ ట్రై చేయకపోతే లైఫ్ వేస్ట్ అని మా ఫ్రెండ్ చెప్పడంతో ఇక్కడకు వచ్చాను. ఇక్కడ వాటిని టేస్ట్ చేసిన తర్వాత ఆమె మాట నిజమే అనిపించింది... అంటూ నిహారిక వ్యాఖ్యానించారు.

వైజాగ్‌లోనే ఇల్లు కొంటా
నిహారిక మంచి ఫుడ్ లవర్. ముఖ్యంగా డిసర్ట్స్ లాంటివి అంటే ఆమెకు మరింత ఇష్టం. బేకర్స్ కాస్టల్‌లో వాటిని టేస్ట్ చేసిన తర్వాత అక్కడే ఇల్లు కొనుక్కుని ఉండి పోవాలనిపించేంత ఇష్టం ఏర్పడింది అంటూ చమత్కరించారు.

సూర్యకాంతం
ప్రస్తుతం నిహారిక ‘సూర్యకాంతం' అనే చిత్రంలో నటిస్తోంది. గతంలో నిహారికతో 'ముద్దపప్పు ఆవకాయ్' లాంటి వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో 'సూర్యకాంతం' తెరకెక్కుతోంది. స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

మార్చి 29 రిలీజ్
సూర్యకాంతం చిత్రానికి నిహారిక ఇటీవలే డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నిహారిక చేసిన సినిమాలకు భిన్నంగా ఉండనుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.


Click it and Unblock the Notifications











