ఆ జలపాతం వద్ద నిహారిక కొణిదెల సాహసం.. సారీ అమ్మ అంటూ షాకింగ్ పోస్ట్

ఓ వైపు సినిమాలలో నటిస్తూ, మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇటీవలి కాలంలో కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ చురుగ్గా ఉంటున్నారు నిహారిక. నిర్మాతగా మంచి సినిమాలు తీయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు మెగా డాటర్. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

యాంకర్‌గా ప్రస్థానం
మెగా బ్రదర్ నాగబాబు వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. తొలుత ఓ ఛానెల్‌లో యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఒక మనసు, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలో నటించారు నిహారిక. ఈ చిత్రాలు హీరోయిన్‌గా ఆమెకు బ్రేక్ ఇవ్వకపోవడంతో బ్రేక్ కోసం ఎదురుచూశారు. ఇంతలోనే చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. అయితే అనివార్య కారణాలతో నిహారిక - చైతన్యలు విడాకులు తీసుకుని విడిపోయారు.

Niharika Konidela enjoying at waterfalls mega daughter sorry to her mother

నిర్మాతగా మెగా డాటర్
విడాకుల తర్వాత ఇంటికే పరిమితమైన నిహారిక తర్వాత నిర్మాతగా అవతారమెత్తారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించారు నిహారిక. గతేడాది కమిటీ కుర్రోళ్లు సినిమాతో వెండితెరపై నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సినిమా భారీ వసూళ్లతో ఆమెకు కలెక్షన్ల వర్షంతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. ఇక నటిగానూ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు నిహారిక. 2019లో చివరిసారిగా సైరా నర్సింహా రెడ్డిలో నటించిన ఆమె.. గతేడాది డార్లింగ్, కమిటీ కుర్రోళ్లు అనే చిత్రాలలో గెస్ట్ రోల్ పోషించారు. తమిళంలో మద్రాస్కరాన్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఆమె వాట్ ది ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

నిహారిక రెండో పెళ్లిపై గాసిప్స్
నిహారిక రెండో పెళ్లిపై గత కొంతకాలంగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె తండ్రి నాగబాబు కూడా.. నిహారిక ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారని కానీ దానికి కొంచెం టైం పడుతుందని చెప్పడంతో వాటికి మరింత బలం చేకూరుతోంది. అటు నిహారిక మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్స్‌ ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలోని టూరిస్ట్ ప్లేస్‌లతో పాటు చారిత్రక స్థలాలను చుట్టేస్తున్నారు. ఇక మాన్‌సూన్ సీజన్‌లో వర్షంలో తడుస్తూ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సారీ అమ్మ
తాజాగా నిహారిక కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఓ గుర్తు తెలియని ప్రాంతానికి వెకేషన్‌కి వెళ్లారు నిహారిక. అక్కడ ఉరకలు వేస్తోన్న ఓ జలపాతానికి దగ్గరిగా వెళ్లి ఎంజాయ్ చేసింది. అయితే వేగంగా గాలులు వీస్తూ.. భారీగా నీరు చిమ్ముతూ, ఆ జలపాతం కాస్త ప్రమాదకరంగా కనిపిస్తోంది. దాంతో తాను ఎప్పుడు బయటికి వెళ్లినా, నేను క్షేమంగా ఇంటికి రావాలని మా అమ్మ నా కోసం ప్రార్ధిస్తూ ఉంటుంది. కానీ నేను మాత్రం ఇలా చేస్తున్నాను.. సారీ అమ్మ అంటూ నిహారిక రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుండగా.. దానికి నిహారిక వదిన, వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి లాఫింగ్ ఎమోజీతో కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X