అలా దారుణంగా అన్యాయం.. లాగేసుకోకుండా ఉండాల్సింది.. నిహారిక తీవ్ర అసంతృప్తి
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియో బ్యానర్‌పై రూపొందిన చిత్రం రాకాస. కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యువ హీరో సంగీత్ శోభన్, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకు రచనా సహకారంతోపాటు మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశీష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వాసూ ఇంటూరి, రోహిణి తదితరులు నటించారు.
ఈ చిత్రం సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫి అన్వర్ అలీ ఎడిటర్‌గా, అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఉమేష్ కుమార్ భన్సల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిల్మీబీట్ అడిగిన ఓ ప్రశ్నకు నిహారిక కొణిదెల స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు, రాకాస సినిమా టీజర్ గురించి వివరాల్లోకి వెళితే..

ఓ గ్రామానికి కలిగిన శాపం వల్ల ఆ ఊరిలో వింత సంఘటనలు, మూఢ నమ్మకాలు పెరిగిపోతాయి. అలాంటి గ్రామంలోకి అమెరికా రిటర్న్ సంగీత శోభన్, గెటప్ శ్రీను అడుగుపెడుతారు. వారికి ఆ ఊరిలో ఎదురైన అనుభవాలు ఏమిటి? ఓ స్త్రీ రేపు రా అనే కాన్సెప్ట్‌తో దెయ్యం చుట్టూ తిరిగే కథలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? ఆ గ్రామానికి ఎవరు? ఎందుకు శాపం పెట్టారు? అనేది ఏప్రిల్ 3వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాలోనే చూడాలని అని నిహారిక చెప్పారు.
ఇటీవల కొచ్చిలో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు జరిగిన చేదు అనుభవం ఆమె స్పందించారు. కమిటీ కుర్రాళ్లు సినిమాకు తొలి చిత్ర దర్శకుడిగా అవార్డు వచ్చింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అయితే ఫిల్మ్‌ఫేర్ అవార్డు ఈవెంట్‌కు వెళ్లలేదు. తొలిసారి దర్శకత్వం చేసే అవకాశం వచ్చిన వారిలో ఓ రకమైన నిజాయితీ ఉంటుంది. అవకాశం వస్తూ ప్రూవ్ చేసుకోవాలనే తపన ఉంటుంది. అది నాకు స్పూర్తిదాయకంగా ఉంటుంది. అందుకే నేను కొత్తవారితో పనిచేయడానికి ఆసక్తి చూపుతాను.
తొలి చిత్ర దర్శకులు గానీ, నటులకు గానీ అవార్డుల ఫంక్షన్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఎంత కష్టపడి వారు ఆ స్థాయికి చేరుకొన్నారో చెప్పుకోవడానికి వారికి ఓ వేదిక కావాలి. అలా చెప్పుకోవడానికి అవకాశం లభిస్తే వారికి సినిమాపై మరింత ఇష్టం కలుగుతుంది. అయితే అవార్డుల ఫంక్షన్‌లో అలాంటి అవకాశం కోసం వెయిట్ చేశాను. ఆ సమయంలో మలయాళం వారికి అవకాశం లభించింది. తమిళ్, తెలుగు, కన్నడ వారికి ఆ అవకాశం లభించలేదు. ఆస్కార్ అవార్డుల్లో కూడా కాల పరిమితి ఉంటుంది. ఆ టైమ్‌లో మాట్లాడకపోతే మైక్ లాగేసుకొంటారు. కానీ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో అలా చేయకుండా ఉంటడాల్సింది. ఒక్క నిమిషంలో లాగేసుకోకుండా ఉంటే బాగుండేది. తొలిసారి అవార్డు గెలుచుకొన్న వారికి అవకాశం ఇవ్వాల్సి ఉండాల్సిందనే అసంతృప్తి నాకు కలిగింది.


Click it and Unblock the Notifications











