మళ్లీ రెచ్చిపోయిన నిహారిక: అందాలతో మెగా డాటర్ ఎటాక్

సాధారణంగా దక్షిణాదిలో చాలా మంది స్టార్లు తమ కుమారులనే సినీ రంగానికి పరిచయం చేశారు. కానీ, కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా తీసుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో కొందరు బాగా హైలైట్ అవుతున్నారు. అందులో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకరు.

నటిగా, నిర్మాతగా, హోస్టుగా సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను మరింతగా అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నిహారిక కొన్ని గ్లామర్ పిక్స్ వదిలింది. అవి మీరే చూసేయండి!

Niharika Konidela Fantastic Looking Photos Gone Viral

అలా మొదలై.. సినిమాల్లో: నిహారిక కొణిదెల టీనేజ్‌లో ఉన్నప్పుడే 'ఢీ' షోతో యాంకర్‌గా వచ్చింది. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ మొదలెట్టి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' వంటి సిరీస్‌లను చేసింది. అనంతరం 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా మారి.. తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు.

Niharika Konidela Fantastic Looking Photos Gone Viral

పెళ్లైనా కంటిన్యూ చేస్తూ: హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన నిహారిక.. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేసింది. ఆ సమయంలోనే ఆమెచైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కంటిన్యూ చేసింది. అయితే, యాక్టింగ్‌ను పక్కన పెట్టినప్పటికీ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వంటి సిరీస్‌లు నిర్మించి వరుసగా హిట్లను ఖాతాలో వేసేసుకుంది.

Niharika Konidela Fantastic Looking Photos Gone Viral

విడాకుల తర్వాత స్పీడ్: చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడిన తర్వాత చాలా ఏళ్ల పాటు పర్సనల్ లైఫ్‌ను నిహారిక ఎంజాయ్ చేసింది. అయితే, ఊహించని విధంగా గత ఏడాదిలోనే ఆమె భర్తకు విడాకులు ప్రకటించింది. అప్పటి నుంచి నిహారిక మళ్లీ నటనను మొదలు పెట్టింది. అలా ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. ముఖ్యంగా 'డెడ్ పిక్సల్'లో బోల్డు రోల్‌లో కనిపించింది.

Niharika Konidela Fantastic Looking Photos Gone Viral

మరోసారి హోస్ట్‌గా మారి: డివోర్స్ తర్వాత నిహారిక యాక్టింగ్‌పై మళ్లీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. అలాగే, సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిహారిక ఆహాలో ప్రసారం కాబోతున్న 'చెఫ్ మంత్ర' షోను హోస్ట్ చేయబోతుంది. ఇది మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సదరు సంస్థ ఇప్పటికే ప్రకటించేసింది.

Niharika Konidela Fantastic Looking Photos Gone Viral

అక్కడ మాత్రం యాక్టివ్: హోస్టుగా, నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా గడుపుతున్న నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

Niharika Konidela Fantastic Looking Photos Gone Viral

ఎక్కువగా అలాంటి పిక్స్: ఆరంభంలో గ్లామర్ షో విషయంలో నిహారిక కొణిదెల అంతగా ఆసక్తిని చూపించేది కాదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు విపరీతంగా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్రమం తప్పకుండా హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. దీంతో నిహారిక కొణిదెల తరచూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ యమ హైలైట్ అవుతోంది.

Niharika Konidela Fantastic Looking Photos Gone Viral

నిహారిక పిక్స్ వైరల్‌గా: మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు స్లీవ్ అండ్ స్ట్రాప్‌లెస్ డెనిమ్ టాప్‌లో అందాలను ఆరబోస్తూ ఫోజులు ఇచ్చింది. అంతే.. నిహారిక షేర్ చేసిన ఈ పిక్స్‌లో ఆమె అందాలు యమ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X