ఆ రోజు వెక్కి వెక్కి ఏడ్చా... నిహారిక కొణిదెల ఎమోషనల్
మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నటిగా, హోస్ట్‌గా, నిర్మాతగా దూసుకెళ్తున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఈ ఏడాది రాకాస మూవీతో మంచి విజయాన్ని అందుకున్న నిహారిక త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌లో ఆమె బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలు చేస్తూనే బుల్లితెరపైనా పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్‌లో పాల్గొన్న నిహారిక.. తాను ఓ సినిమా చూసి ఎమోషనల్ అయినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోనీ.. హీరోగా నటించిన తాజా చిత్రం నూరు సామి తెలుగులో వంద దేవుళ్లు పేరుతో విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మిస్తున్నారు. శ్వాసిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. అజయ్ దిశాన్, లిజిమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్‌దాస్, మున్షికాంత్, పడిని కుమార్, జెన్సన్ దివాకర్, బక్స్, వినోదిని, తమరై, కొడంగి వడివేలు తదితరులు కీలకపాత్రలు పోషించాగా శశి దర్శకత్వం వహించారు. ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా, హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకత్వం వహించారు. జూన్ 19న నూరు సామి చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా జూన్ 15న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నూరుసామి సినిమాను ముందే చూసిన అతికొద్ది మందిలో నేను కూడా ఒకదానిని. నాకు ప్రివ్యూ వేసినందుకు విజయ్ ఆంటోనీకి థ్యాంక్స్ చెప్పారు నిహారిక. మీరందరూ బిచ్చగాడు.. బిచ్చగాడు అంటున్నారు కానీ నేను మీరు విక్టరీ వెంకటేష్ గారితో తీసిన శీను సినిమా చూసి వెక్కి వెక్కి ఏడ్చాను సార్. ఆ సినిమా ఇప్పటికీ మరిచిపోలేను అని దర్శకుడు శశిపై ప్రశంసల వర్షం కురిపించారు నిహారిక. ఏదైనా సినిమా చేసేటప్పుడు ఆడియన్స్‌కి ఎంత నచ్చుతుంది, దీనిలో కమర్షియల్ వాల్యూస్ ఏంత? దీనిని ఎంత పుష్ చేయాలని ఆలోచిస్తారు. కానీ చాలా కొద్దిమంది మాత్రం హార్ట్ పెట్టి చేస్తారు. ఒకరిద్దరూ కాదు టీమ్ అంతా. అలాంటిది నాకు బిచ్చగాడిలో కనిపించింది... మళ్లీ అది వంద దేవుళ్లు సినిమాలో కనిపించింది. అందరూ మనసు పెట్టి 100 పర్సెంట్ ఇచ్చారు అని నిహారిక పేర్కొన్నారు.
ఇలాంటి సినిమాల్నీ మనం అంతగా కాన్సన్‌ట్రేట్ చేసి చూడము.. అమ్మాయిలు పెళ్లయిన తర్వాత, తల్లి అయిన తర్వాత కంప్లీట్‌గా అమ్మ అయిపోతారు. ఇలాంటి క్యారెక్టర్‌ను చాలా అద్భుతంగా రాశారు శశిగారు.. శ్వాసిక గారు అద్భుతంగా నటించారు. అమ్మలు అన్ని పనులు చేస్తారు.. కానీ అమాయకంగా కనిపిస్తారు. అజయ్, శక్తిలు చాలా క్యూట్‌గా నటించారు. కావ్య చాలా తక్కువ సేపు కనిపించినా .. మంచి ఇంపాక్ట్ చూపించారు. ఈ టైటిల్ చాలా బాగుంది.. బిచ్చగాడు సాంగ్‌లోని వంద దేవుళ్లు కలిసొచ్చినా అనే పదం గొప్పది. బిచ్చగాడు తర్వాత మీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుందంటే చాలా ఆనందంగా ఉందని నిహారిక తెలిపారు.
విజయ్ ఆంటోనీ గారి సినిమాలు చూశాను.. ఆయన మంచి నటుడు, సంగీత దర్శకుడే కాదు చాలా మంచి మనిషి. కొంతమంది స్టార్స్‌ను కలిశాక వాళ్ల మీద మనం కట్టుకున్న అభిమానం అనే కోట కూలిపోతుంది. కానీ విజయ్ గారిని కలిశాక ఆ అభిమానం ఇంకా రెట్టింపు అయ్యింది, ఇలాంటి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ సినిమాలో ఫ్యాన్ నుంచి టీ కప్పు వరకు అన్నింటికి క్యారెక్టర్ ఉంది.. క్లైమాక్స్ అదిరిపోయింది, నేను సీటులోంచి లేచి నవ్వాను. విజయ్ గారు గ్రీన్ ఫారెస్ట్.. అబ్బాయిలు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత గుండె నిండిన ఆనందం కనిపించింది. ఇప్పటి జనరేషన్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. జూన్ 19న అందరూ ఈ సినిమా చూస్తారు.. బిచ్చగాడు కంటే పెద్ద హిట్ చేస్తారని ఆకాంక్షిస్తున్నానని నిహారిక పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


