Niharika Konidela: బీచ్‌లో షాక్ ఇచ్చిన నిహారిక కొణిదెల.. ఎవరినీ పట్టించుకోకుండా క్లీవేజ్ షో
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయమై టాలీవుడ్ లో హవా సాగిస్తున్నారు. అలాగే ఈ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో చాలా కాలం గ్యాప్ తీసుకుంది. ఇటీవలే వెబ్ సిరీస్ ద్వారా యాక్టింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి తాజాగా బీచ్ లో రచ్చ చేస్తూ కనిపించింది.
బడా ఫ్యామిలీ: బడా ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్లలో నిహారిక కొణిదెల ఒకరు. చాలా కాలం క్రితమే తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ బ్యూటి ఏ రంగంలో వీలైతే ఆ రంగంలో తన సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ ముద్దుగుమ్మ ముందుగా 'ఢీ' అనే డ్యాన్స్ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

షార్ట్ ఫిల్మ్స్: ఢీ షోలో మెప్పించిన మెగా డాటర్ నిహారిక తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లనూ చేసింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుంది.
నో గుడ్ ఎంట్రీ: ఓవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా రాణించిన గ్లామరస్ భామ నిహారిక కొణిదెల 2016లో వచ్చిన ఒక మనసు చిత్రంతో వెండితెరపై హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. నాగ శౌర్య నటించిన ఈ సినిమాలో నిహారిక కొణిదెల తన నటన పరంగా ఆకట్టుకుంది. కానీ అనుకున్నంత హిట్ కాలేదు. ఇలా మొదటి సినిమా ప్లాప్ కావడంతో మంచి ఎంట్రీ తెచ్చుకోలేకపోయింది.

విజయ్ సేతుపతితో: మొదటి సినిమా ప్లాప్ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి తదితర చేసిన నిహారిక కొణిదెలకు అవి కూడా పెద్దగా విజయం తెచ్చిపెట్టలేకపోయాయి. నిహారిక కొణిదెల హీరోయిన్ గా చివరిగా ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాలో నటించింది. ఇందులో విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించాడు.
వెబ్ సిరీసుతో మళ్లీ: ఇదే కాకుండా చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ ఒక పాత్రలో మెరిసింది బ్యూటిఫుల్ నిహారిక. అయితే తర్వాత నిర్మాతగా మారి పలు వెబ్ సిరీసులను నిర్మించింది ఈ ముద్దుగుమ్మ. అలా నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీసులకు మంచి పేరు వచ్చింది. అయితే ఇటీవలే డెడ్ పిక్సెల్ సిరీసుతో యాక్టింగ్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నిహారిక.

ఎవరినీ పట్టించుకోకుండా: సుమారు ఐదేళ్ల తర్వాత నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోలు, పోజులతో ఆకట్టుకుంటోంది. తరచూ గ్లామర్ షో చేస్తూ తనవైపుకు అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా బీచ్ లో ఆరేంజ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో అటు ఇటు తిరుగుతూ రచ్చ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. అయితే ఈ వీడియోకు రిప్లైగా ఇలా ఎవరినీ పట్టించుకోకుండా వాక్ చేస్తాం అని చెప్పింది నిహారిక.


Click it and Unblock the Notifications











