ఫోటోలతోనే షాకులిస్తున్న మెగా డాటర్.. అగ్గిరాజేస్తున్నావ్.. నెటిజన్ల కామెంట్స్
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు.. వస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొందరు సక్సెస్ అయ్యారు.. మరికొంతమంది సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే మెగా కుటుంబంలోంచి వచ్చిన ఏకైక హీరోయిన్.. నిహారిక కొణిదెల. అందర్నీ ఒప్పించి వెండితెరకు ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ.. సక్సెస్ కొట్టలేకపోయింది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా..
ఒక మనసు సినిమాతో డీ గ్లామర్ రోల్ చేసింది. ఆపై హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అంటూ ఏవేవో ప్రయత్నాలు చేసింది కానీ ఏ ఒక్కటి కలిసి రాలేదు. పైగా తమిళంలోనూ విజయ్ సేతుపతితో ఓ చిత్రాన్ని చేసింది. అది కూడా వర్కౌట్ కాలేదు.

వెబ్‌సిరీస్‌లో హవా..
వెండితెరపై రాణించని నిహారిక.. వెబ్‌సిరీస్‌లతో సత్తా చాటింది. ముద్దుపప్పు ఆవకాయ, నాన్నకూచి అంటూ మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతోనే కాలవ వెళ్లదీస్తోంది. ఇక దాదాపుగా సినిమా రంగానికి దూరమైనట్టేనని టాక్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో హల్ చల్..
వెండితెరకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అయితే ఈ మధ్య నిహారిక తన పంథాను మార్చినట్టు కనిపిస్తోంది. షేర్ చేసే ఫోటోల్లోనూ కొంత తేడా కొడుతోంది.
Recommended Video

హాట్ పిక్స్‌తో చుక్కలు..
నిహారిక హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. హద్దులు మీరకుండానే చేస్తోన్న ఈ ఎక్స్‌పోజింగ్‌కు నెటిజన్లకు చెమటలు పట్టేట్టున్నాయి. తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోలో నిహారికను చూసి.. అగ్గిరాజేస్తున్నావ్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.


Click it and Unblock the Notifications











