నిహారిక టాప్ క్లాస్ గ్లామర్ షో: అందాలకు పువ్వులు అడ్డుపెట్టి!
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు. అందులో చాలా మంది స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అదే కుటుంబం ఓ హీరోయిన్‌ను కూడా పరిచయం చేసింది. ఆమెనే నిహారిక కొణిదెల. చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. కెరీర్ విషయంలో, పర్సనల్ విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. మళ్లీ ఇప్పుడు నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో నిహారిక సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ బోల్డు పిక్‌ను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!
అప్పుడే వచ్చి.. అవి చేసి:నిహారిక 'ఢీ' షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను చేసింది. ఈ క్రమంలోనే 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా ఎంటరై.. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. కానీ, ఇవేమీ సక్సెస్ కాకపోవడంతో గ్యాప్ ఇచ్చింది.

చైతూతో పెళ్లి.. కంటిన్యూ:హీరోయిన్‌గా హిట్ కాలేకపోయిన నిహారిక యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చిన సమయంలోనే చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగించింది. అయితే, గతంలో మాదిరిగా యాక్టింగ్ చేయకున్నా.. నిర్మాతగా మారి 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వంటి సిరీస్‌లు నిర్మించి విజయాలను సొంతం చేసుకుంది.

విడాకులు ఇచ్చిన భామ:వివాహం జరిగిన తర్వాత బెస్ట్ కపుల్ అనిపించుకున్న నిహారిక - చైతన్య ఇటీవలే విడాకులు తీసుకున్నారు. తద్వారా రెండున్నరేళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలికేశారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, తమకు కాస్త ప్రైవసీని ఇవ్వాలని కోరుతూ వేరువేరుగా పోస్టులు పెట్టారు.
బోల్ట్ యాక్టింగ్... మరిన్ని:నిహారిక కొణిదెల ఇటీవలే 'డెడ్ పిక్సల్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఇందులో ఈ మెగా డాటర్ బోల్డుగా కనిపించింది. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా పలికింది. ఇక, విడాకుల తర్వాత నిహారిక యాక్టింగ్ మీద ఫుల్‌గా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే కొన్ని సిరీస్‌లు, సినిమాల్లోనూ నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అక్కడ యమా యాక్టివ్:మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. తద్వారా తన వాళ్లను ఖుషీగా ఉంచుతుంది.

అందాలతో దాడి చేస్తూ:టాలీవుడ్‌లోనే బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో నిహారిక కొణిదెల గ్లామర్ షో విషయంలో కాస్త జాగ్రత్తలు పడేది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా క్రమం తప్పకుండా హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా తరచూ హైలైట్ అవడంతో పాటు ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

బోల్డు ఫొటో వదిలింది:ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో లైన్ దాటిసి మరీ బోల్డు షో చేస్తోన్న నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ గ్లామర్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్ట్రాప్‌లెస్ టాప్‌లో ఘాటుగా ఫోజు ఇచ్చింది. అలాగే, క్లీవేజ్ పార్ట్ కనిపించకుండా పువ్వులు అడ్డుగా పెట్టుకుంది. అయినప్పటికీ ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











