Niharika Konidela: ఏంటి నిహా బ్లౌజు లేకుండా ఈ చీరకట్టు.. అందంతోనే చంపేసటట్టున్నావుగా!
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురుగా, మెగా డాటర్ గా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి గుర్తింపే తెచ్చుకుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లలోనూ నటించింది. ముఖ్యంగా ఆమె, తన తండ్రితో కలిసి చేసిన నాన్న కూచి, ముద్దపప్పు ఆవకాయ్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కేవలం నటిగానే కాకుండా వీటికి తానే నిర్మాతగా కూడా మారి గ్రేట్ ప్రొడ్యూసర్ అనిపించుకుంది.
2016లో నాగశౌర్యతో కలిసి ఒక మనసు చిత్రంలో నటించింది. హీరోయిన్ గా ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో కథానాయికగా కనిపించింది. అయితే ఈ చిత్రాలు అంత పెద్ద హిట్లు కాలేదు. కానీ నటన పరంగా మాత్రం నిహారిక మంచి మార్కులే పడ్డాయి. ఒక మనసు సినిమాకు అయితే విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఒరు నల్లనాళ్ పాత్తు సోల్రేన్ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టింది.

ప్రస్తుతం భర్తతో విడాకులు తీసుకున్న నిహారిక.. కెరియర్ పైనే ప్రత్యేక దృష్టి సారించింది. ఓ వైపు నటిగా, మరోవైపు నిర్మాతగా పనిచేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఓవైపు సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియా వేదికగాను చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే లుక్కులో కనిపించి అభిమానుల్ని ఆగం చేస్తోంది.
ముఖ్యంగా బ్లూ కలర్ చీర కట్టుకున్న ఈ క్యూట్ బ్యూటీ.... బ్లౌజు వేసుకోకుండానే ఫొటోలు దిగింది. రోజురోజుకూ గ్లామర్ షో పెంచి నెట్టింటని షేక్ చేస్తున్న మెగా డాటర్.. అందాలకు అంతా ఫిదా అయిపోతున్నారు. బ్లూ కలర్ లెనిన్ కాటన్ శారీలో నిహారిక చాలా పద్ధతిగా కనిపిస్తోంది. బ్లౌజ్ వేసుకోకపోయినప్పిటికీ పద్ధతిగానే ఉంది. ఈ చీర కట్టుకున్న ఆమె రెండు జడలు వేసుకొని సీతలా దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, అందంగా ఉన్నావంటూ చెప్పుకొస్తున్నారు.
చేతిల నిండా గాజులు, ముక్కు పుడక, కాసుల మాల వేసుకొని అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది నిహారిక. కేవలం ఈరోజే కాదు నాలుగు రోజుల క్రితం కూడా ఈ క్యూట్ బ్యూటీ బ్లౌజు వేసుకుకోండానే సారీ కట్టుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇలా బ్లౌజ్ లేకుండా ఆమె ఫొటోలు దిగడం ఇది రెండోసారి. ఇది గమనిస్తున్న నెటిజెన్లు... ఏంటి నిహా బ్లౌజ్ లేకుండానే ఫొటోలు, అందంతోనే చంపేసేటట్లున్నావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ సారి నిహారిక ఫొటోలపై లుక్కేసి ఆమె అందాన్ని ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications











