చైతన్యతో విడాకులపై నాన్న రియాక్షన్ అలా... ఓపెన్ అయిన నిహారిక కొణిదెల

హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కన్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. మెగా ఫ్యామిలీకి గారాలపట్టి కావడంతో నిహారిక లాంచింగ్ అలవోకగా జరిగిపోయింది. తొలుత పలు షోలకు హోస్ట్‌గా, న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నిహారిక ఆ తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి తదితర సినిమాలో కీలకపాత్రలు పోషించారు నిహారిక. ఇవి కూడా డిజాస్టర్ కావడంతో కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ప్రకటించారు మెగా డాటర్.

ఈ గ్యాప్‌లోనే నిహారిక పెళ్లికూతురు కాబోతోందని టాలీవుడ్‌లో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఓ రోజున సడెన్‌గా ఓ కుర్రాడిని హగ్ చేసుకుని ముఖం చూపించకుండా త్వరలో ఇతనితో ఏడాడుగులు నడవబోతున్నట్లుగా బాంబు పేల్చారు నిహారిక. అతనే చైతన్య జొన్నలగడ్డ... వ్యాపారవేత్తగా రాణిస్తున్న చైతన్యతో నిహారికకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. రాజస్థాన్‌లో వీరి పెళ్టి అంగరంగ వైభవంగా జరిగింది. కొన్నాళ్లు చైతన్య - నిహారిక కాపురం సజావుగానే సాగగా.. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దాంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

Niharika Konidela Opens Up About Divorce with Chaitanya Jonnalagadda

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ సంఘటన తాలుకా బాధ నుంచి కోలువకోడానికి నిహారికకు చాలా సమయం పట్టింది. కొన్నాళ్లు ఇంటికే పరిమితమైన మెగా డాటర్ అప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌‌ను స్థాపించారు. దాంతో నిర్మాతగా సక్సెస్ కొట్టాలని నిశ్చయించుకుని ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించారు నిహారిక. ఇక రెండేళ్ల క్రితం కమిటీ కుర్రోళ్లు సినిమాతోనూ సక్సెస్ కొట్టి మంచి వసూళ్లతో పాటు గద్ధర్ అవార్డ్ సైతం అందుకున్నారు నిహారిక.

ప్రస్తుతం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌- నిహారిక కొణిదెల కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, సుఖ్వీందర్ సింగ్, అనూపర్ సింగ్, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాకాస చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ, కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారికను చైతన్య జొన్నలగడ్డతో విడాకుల గురించి ప్రశ్నించారు. దానికి మెగా డాటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్నకు విడాకుల గురించి చెప్పగానే ఆయన సైలెంట్ అయిపోయారు. జీవితంలో సంతోషమే ముఖ్యం. అది లేనప్పుడు నువ్వు ఎక్కడా బతకలేవు. సంతోషం అనేది పరస్పరం అర్ధం చేసుకుంటూనే సాధ్యం. పెళ్లి చేసుకునేది విడిపోవడానికి కాదు కదా.. అలా జరిగిందంటే అది చిన్న రీజన్ వల్ల కాదు. పరిష్కరించుకోవడానికి కూడా కుదరని సందర్భంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇద్దరం విడిపోవడం అనేది మంచిది. విడాకుల తర్వాత వచ్చే సమస్యలు, ప్రయోజనాల గురించి స్పష్టమైన అవగాహన ఉంటేనే ఆ నిర్ణయం తీసుకోగలం. నా జీవితంలో ధైర్యం మా నాన్నే.. అందుకే ఫస్ట్ ఆయనకే చెప్పేశానని నిహారిక వెల్లడించారు.

డివోర్స్ ఫ్యాషన్ అయిపోయింది.. ఎవరి పడితే వాళ్లు తీసుకుంటున్నారు, ఒకప్పుడు మాత్రం నేను భర్తను వదిలేసి వస్తే నా తండ్రి నన్ను పోషించగలుగుతాడా అనుకునేవాళ్లు. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లిపోయినా చూసుకునే పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్లు అన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నారు.. అప్పట్లో మా ఆయనకి చెబితే ఏమంటారో అని భయపడేవాళ్లు. ఆఫీసులో కూడా బాస్ పెట్టే వేధింపులు భరిస్తూ.. డబ్బు కోసం ఎన్నాళ్లు పడి ఉంటామని అనుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మెడిటేషన్, థెరపీలు అంటున్నారు.. అప్పట్లో ఇవేం లేవు. అప్పుడు మనకి కరెక్ట్ అనిపించింది.. ఇప్పుడు కరెక్ట్ అనిపించకపోవచ్చు. అలాగని మన మీద మనం నిందలు వేసుకునే ధైర్యం లేదు. అందరూ పక్కవాడి మీద తోసేయ్యాలనే చూస్తారు. బాధ నుంచి తప్పించుకోవడానికి అబ్బాయిలు మందు, ఫ్రెండ్స్‌తో గడిపేస్తారు. రిలేషన్స్ అన్నీ పాడు చేసుకుని లాస్ట్ మినిట్‌లో ఆలోచించడం మొదలుపెడతారు. మేం కూడా ఏడుస్తూనే ఉంటాం. నువ్వు జడ్జిమెంట్ లేకుండా ధైర్యంగా ఎవరితో అయితే మాట్లాడగలుగుతావో అదే నిజమైన ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్స్‌ని సంపాదించుకోవడం కొంచెం టైం పడుతుంది. విడాకులు జరిగాక మళ్లీ ఎప్పుడూ చైతన్యని కలవలేదు.. కనీసం కాంటాక్ట్ నెంబర్ కూడా లేదని నిహారిక పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: niharika konidela movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X