Niharika Konidela: అదే నా పెద్ద ఇన్ సెక్యూరిటీ.. మెగా డాటర్ కామెంట్స్ వైరల్

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నారు. నటిగా కెరీర్ ప్రారంభించిన నిహారిక, ఆ తర్వాత నిర్మాతగా మారి కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా కమిటీ కుర్రాళ్లు (Committee Kurrollu) విజయం ఆమెను నిర్మాతగా మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాకి వచ్చిన ఆదరణతో పాటు అవార్డులు కూడా నిహారికలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె, యూత్‌కు దగ్గరయ్యే కథలపై ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

తాజాగా శ్రీ చిదంబరంగారు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిహారిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా డాటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టేజ్‌పై మాట్లాడిన ఆమె... అక్కడ మూవీ టీమ్‌ను అభినందిస్తూ నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు. "సినిమా నిర్మాణం అనేది అంత ఈజీ కాదు. ఒక సినిమాను మన వీపు మీద వేసుకున్నప్పుడు వచ్చే స్ట్రెస్ ఏంటో అర్థమవుతుంది. ఆ విషయం 'కమిటీ కుర్రాళ్లు'సమయంలో నిజంగా అర్థమైంది. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తేనే ఇండస్ట్రీ ఊపిరి తీసుకుంటుంది అనే నమ్మకం నాకు ఉంది' అంటూ నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు.

Niharika Konidela Opens Up About Her Biggest Insecurity

అలాగే, మొదటి సినిమా ఫీలింగ్ జీవితాంతం గుర్తుండిపోతుందని, ప్రతి ప్రశంస మనల్ని ముందుకు నడిపిస్తుందని చెప్పారు. యంగ్ జనరేషన్‌ను ఇండస్ట్రీలోకి తీసుకురాగలిగితేనే సినిమా ఊపిరి తీసుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తొలి సినిమా రోజుల్ని గుర్తు చేసుకుంటూ, 'మొదటి సినిమా అనుభవం లైఫ్‌లో మళ్లీ రాదు. రిలీజ్ ముందు ఉండే బెరుకు, నమ్మకం - ఈ రెండూ చాలా క్యూట్ ఫీలింగ్స్. అప్పటి ఎగ్జైట్‌మెంట్ జీవితాంతం గుర్తుంటుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి ప్రశంస మనల్ని ముందుకు నడిపిస్తుంది' అని చెప్పారు.

ఈ సందర్భంగా తన ప్రయాణం గురించి కూడా ఓపెన్ అయ్యారు నిహారిక. 'నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే ఖచ్చితంగా నా ఫ్యామిలీ కారణమే. ఫ్యామిలీ వల్లనే సినిమాలోకి వచ్చాను. చిన్నప్పటి నుంచి సినిమా అంటే నాకు ప్యాషన్ గా మారిపోయింది'అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇక హార్ట్ లో నుంచి వచ్చిన కథలే బెస్ట్ స్టోరీస్ అవుతాయి అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు.

అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం ఆమె చెప్పిన 'ఇన్‌సెక్యూరిటీ' కామెంట్. యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... 'నేనేం మనిషిని కాదా? నాకు కూడా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. చిన్నప్పుడు నా గమ్మీ స్మైల్ ఒక పెద్ద ఇన్‌సెక్యూరిటీ. కానీ కాలక్రమేణా ఆ ఫీలింగ్ పోయింది' అని సరదాగా చెప్పడం ప్రేక్షకులను నవ్వించింది. ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. నటి గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా సక్సెస్ అవుతున్న తీరు అభిమానులను ఆకట్టుకుంది.

ఇక నిహారిక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, నిహారిక త్వరలో సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'రాకాస' సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు తన అన్న వరుణ్ తేజ్ తో కలిసి ఓ సినిమా నిర్మించబోతున్నారన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

నటిగా కాకుండా నిర్మాతగా తనదైన ప్రయాణం సాగిస్తున్న నిహారిక కొణిదెల... స్టేజ్‌పై చెప్పిన ఈ "ఇన్‌సెక్యూరిటీ" మాటలు ఆమె నిజాయితీకి నిదర్శనంగా మారాయి. యంగ్ టాలెంట్‌కు అవకాశాలు ఇస్తూ, హార్ట్ నుంచి వచ్చిన కథలతో ముందుకు వెళ్తున్న ఈ మెగా డాటర్ ప్రయాణం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X