Niharika Konidela : మల్టిపుల్ కలర్ శారీలో మెగా డాటర్ ధగధగలు .. కిర్రాక్ లుక్‌లో నిహారిక

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఆయన కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. నాగబాబు , పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి దుర్గా తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్‌లు హీరోలుగా వచ్చి ప్రేక్షకులను మెప్పించారు. వీరిలో నిహారిక కూడా ఒకరు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు నిహారిక.

తొలుత తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌లో ప్రసారమైన ఢీ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక కొణిదెల తర్వాత ఒక మనసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాల్లో నటించింది. తర్వాత పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో మెరిసింది. అయితే నటిగా అంత సక్సెస్ కాలేకపోవడంతో నిహారిక కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. అనంతరం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారింది.

Niharika Konidela PhotoShoot With multiple color saree Her latest photos here

ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సినిమాలపై ఫోకస్ పెట్టిన నిహారిక.. ఈ ఏడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించారు. యదు వంశీ దర్శకత్వంలో సందీప్ సరోజ్, సాయి కుమార్, గోపరాజ్ రమణ తదితరులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 25 కోట్లు రాబట్టి తొలి ప్రయత్నంలోనే నిహారిక నిర్మాతగా సక్సెస్ కొట్టారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను ఆమె నిర్మిస్తున్నారు.

సినిమాలతో పాటు తన తల్లిదండ్రుల మాదిరిగానే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నిహారిక. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి , తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని 10 గ్రామాలకు రూ. 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీలకు నిహారిక తండ్రి , జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు రూ.50 వేల చొప్పున చెక్కులను అందజేశారు.

కాగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్‌లో నిహారిక వివాహం గ్రాండ్‌గా జరిగింది. కానీ పెళ్లయిన రెండేళ్లకే ఈ జంట విడాకులకు అప్లయ్ చేయడం సినీ పరిశ్రమను, మెగా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటనేది ఇంత వరకు తెలియరాలేదు. విడిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకోగా.. చైతన్య మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిహారికను మీడియా ప్రతినిధులు పలుమార్లు ఈ విషయం గురించి ప్రశ్నించగా.. ఆమె దాటవేశారు. ప్రస్తుతానికి తన ఫోకస్ కెరీర్‌పైనే ఉందని తెలిపారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిహారిక.. తాజాగా మల్టిపుల్ కలర్ శారీలో చేసిన ఫోటో షూట్ తాలూకూ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం ఈ ఫోటోలను మీరూ చూసేయండి.

More from Filmibeat

Read more about: niharika konidela movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X