జీవితమంతా కళ్లెదుట గిర్రున తిరిగింది.. పండగపూట నిహారిక ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి వేసిన బలమైన పునాదులపై మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలుగా, నిర్మాతలుగా చిత్రసీమలో అడుగుపెట్టి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగుపెట్టారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. నాగబాబు గారాలపట్టిగా, మెగా హీరోలకు చిట్టి చెల్లెలుగా అందరి ప్రేమను పొందుతున్నారు. అయితే హీరోయిన్ కావాలన్న ఆమె కల కల్లలుగా మారినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిర్మాతగా నిలదొక్కుకుంటున్నారు.
హీరోయిన్‌గా నిరాశ
బుల్లితెరపై హోస్ట్‌గా తొలుత అడుగుపెట్టిన నిహారిక కొణిదెల ఆ తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్‌గా టర్న్ అయ్యారు. ఈ సినిమా ఫ్లాప్ కాగా.. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి తదితర సినిమాలలో నటించారు. ఇవి కూడా నిహారికకు నిరాశనే మిగిల్చాయి. ప్రముఖ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లిని గ్రాండ్‌గా జరిపించారు పెద్దలు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురం అనుకోకుండా బీటలు వారింది. జీవితంలో ఇక కలిసి సాగలేమని నిర్ణయించుకున్న ఈ జంట.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంది.

విడాకులతో డిప్రెషన్‌లోకి
నిహారిక విడాకుల వ్యవహారం మెగా అభిమానులను తీవ్రంగా బాధించింది. వ్యక్తిగత జీవితంలో ఓ షాక్‌లా తగిలిన ఈ ఇన్సిడెంట్ నుంచి ఆమె కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయంతో నెమ్మదిగా బయటపడ్డ నిహారిక ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. హీరోయిన్‌గా సక్సెస్ కాకపోవడంతో తన బలం ఏంటన్నది గ్రహించిన నిహారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారారు.
నిహారిక రెండో పెళ్లిపై గాసిప్స్
వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు తెరకెక్కించిన నిహారిక గతేడాది కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను నిర్మించి తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. ఈ సినిమాకు అవార్డులు, రివార్డులు వెల్లువెత్తాయి. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరిన్ని సినిమాలు తెరకెక్కించేందుకు నిహారిక సిద్ధమవుతున్నారు. నిహారిక గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. ఈ మెగా డాటర్ మరోసారి ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. నిహారిక రెండో పెళ్లి గురించి ఆమె తండ్రి నాగబాబు పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె పెళ్లి చేసుకుంటుందని, అయితే దానికి సమయం రావాలని ఆయన వెల్లడించారు.
నా జీవితం కళ్లెదుట తిరిగింది
ఇకపోతే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిహారిక కొణిదెల.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను మీడియాతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలి కాలంలో తన గ్లామర్ డోస్ కూడా నిహారిక పెంచారు. తాజాగా ఈ మెగా డాటర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటన, ప్రొడక్షన్ తనకు రెండు కళ్లలాంటివి, ఇందులో ఏది ఎక్కువ? ఏది తక్కువ? అని చాలా మంది అడుగుతుంటారు. నటన నా ప్యాషన్ అయితే.. నిర్మాణ రంగం నేను ఎదగడానికి తోడ్పడిందని నిహారిక స్పష్టం చేశారు. ఓ ఛానెల్‌లో జడ్జిగా వెళ్లిన నేను, ఆ పక్క బిల్డింగ్‌లోనే ఉన్న నా ఆఫీస్‌కి వెళ్లి నా ప్రొడక్షన్ పనులు చూసుకున్నానని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు నా ప్రయాణం అంతా ఒక్కసారిగా గిర్రున తిరుగుతుంటే హృదయం సంతోషం తట్టుకోలేకపోతోందని నిహారిక స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











