రెచ్చిపోయిన మెగా డాటర్ .. బోల్డ్ సీన్స్‌లో విచ్చలవిడిగా, మెంటలెక్కిస్తోన్న నిహారిక

తెలుగు చిత్ర పరిశ్రమను కనుసైగతో శాసించగల పెద్ద కుటుంబాల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా ఒకటి. ఆయన వేసిన పునాదులపై ఇప్పుడు మెగా సామ్రాజ్యం ఏర్పడింది. చిరు తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ ఇలా దాదాపు 10 మంది హీరోలు ఒక్క మెగా కుటుంబంలో ఉన్నారు. ఇవి కాకుండా బడా నిర్మాణ సంస్ధలైన గీతా ఆర్ట్స్, జీఏ2, కొణిదెల ప్రొడక్షన్స్, అంజనా ప్రొడక్షన్స్.. ఓటీటీ సంస్థ ఆహా ఈ కుటుంబానివే. ప్రతి యేటా మెగా హీరోల పేరు మీదుగా వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక. తొలుత తెలుగు ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌లో ప్రసారమైన ఢీ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక కొణిదెల తర్వాత ఒక మనసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాల్లో నటించింది. తర్వాత పలు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో మెరిసింది.

Niharika konidela s romantic song from madraskaaran

సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్‌లో నిహారిక వివాహం గ్రాండ్‌గా జరిగింది. కానీ పెళ్లయిన రెండేళ్లకే ఈ జంట విడాకులు తీసుకోవడం సినీ పరిశ్రమను, మెగా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఇబ్బందిని తట్టుకుని నిలబడిన నిహారిక తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. అయితే నటిగా అంత సక్సెస్ కాలేకపోవడంతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారింది.

ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సినిమాలపై ఫోకస్ పెట్టిన నిహారిక.. ఈ ఏడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించారు. యదు వంశీ దర్శకత్వంలో సందీప్ సరోజ్, సాయి కుమార్, గోపరాజ్ రమణ తదితరులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 25 కోట్లు రాబట్టి తొలి ప్రయత్నంలోనే నిహారిక నిర్మాతగా సక్సెస్ కొట్టారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను ఆమె నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాతగా ఉంటూనే హీరోయిన్‌గా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా మలయాళ మూవీ మద్రాస్ కారన్‌లో నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్‌గా కాళ్ల చెడుగుడే సాంగ్‌ రిలీజ్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సఖి సినిమాలోని ఓరిజినల్ సాంగ్‌ని ఈ సినిమా కోసం రీమేక్ చేశారు. ఇందులో నిహారిక, షేన్‌లు డ్యాన్స్ ఇరగదీయగా.. నిహారిక బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి కనిపించారు. ఆమె ఈ స్థాయిలో రొమాంటిక్ సాంగ్‌లో నటిస్తుందని ఊహించని నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ సాంగ్‌ ప్రమోషన్‌లో వాడుకుంటారా? సినిమాలో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X