నిహారిక కొణిదెల రెండో పెళ్లి రూమర్లు.. మెగా డాటర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
తన కృషి, పట్టుదలతో అసాధారణ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబానికి తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టారు. నందమూరి, అక్కినేని వంటి బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల స్థానంలో మెగా ఫ్యామిలీని నిలబెట్టారు. చిరంజీవి వేసిన బాటలో ఆయన కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా దాదాపు డజను మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి సోదరులు, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్లు అంతా కళామతల్లి సేవలో తరిస్తున్నారు.
నాగబాబు వారసురాలిగా ఎంట్రీ
చిరంజీవి రెండో సోదరుడు నాగబాబు కూడా అన్న అడుగుజాడల్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆయన నట వారసుడిగా వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లోని యువ హీరోలలో వరుణ్ కూడా ఒకరు. ఇక ఈయన సతీమణి లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. కొడుకుతో పాటు కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు నాగబాబు. ఆయన కుమార్తె నిహారిక కొణిదెల మెగా డాటర్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.

నటిగా ఫెయిలైన నిహారిక
అంతకంటే ముందే బుల్లితెరపై తన అదృష్టం పరీక్షించుకున్నారు నిహారిక. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ఢీ ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించారు నిహారిక కొణిదెల. ఆ తర్వాత జబర్దస్త్ షోకు కొద్దిరోజులు యాంకర్‌గానూ వ్యవహరించారు. అనంతరం నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసులో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు నిహారిక. కాని ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలలోనూ, పలు వెబ్ సిరీస్‌లలో మెరిసింది. కానీ అవేవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలని నిర్ణయించున్న నిహారిక .. చైతన్య జొన్నలగడ్డని వివాహమాడారు. కానీ కొద్దినెలలకే ఈ జంట విడాకులు తీసుకుని షాకిచ్చింది.
నిర్మాతగా హిట్ కొట్టిన నిహారిక
వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులతో కొన్నాళ్లు బాధపడిన నిహారిక సినీ నిర్మాణం వైపు అడుగులు వేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారింది. ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించారు. నిర్మాణం, ప్రొడక్షన్, స్క్రిప్ట్‌లపై కాస్తంత అనుభవం సంపాదించిన అనంతరం గతేడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించారు నిహారిక. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా రాబట్టింది. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను నిహారిక నిర్మిస్తున్నారు.
సిద్ధూ జొన్నలగడ్డతో పెళ్లి, విడాకులు
కెరీర్ పరంగా స్థిరపడుతున్న నిహారికను తిరిగి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేలా చేయాలని పెద్దలు భావిస్తున్నారు. ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి షాకిచ్చారు నిహారిక. తన కెరీర్ బాగుండాలనే ఉద్దేశంతో చండీ హోమం, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిహారిక తన జీవితంలో ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
భారీగా పెరిగిన నిహారిక ఆస్తులు
ఇదిలాఉండగా ఇన్నేళ్ల కెరీర్‌లో నిహారిక ఎంత సంపాదించింది? తండ్రి నుంచి ఎంత ఆస్తి వచ్చింది? అంటూ నెటిజన్లు తరచుగా ప్రశ్నిస్తుంటారు. సినిమాల పారితోషికం, సినిమాల నిర్మాణం, పెట్టుబడులు తదితర మార్గాల ద్వారా నిహారిక బాగానే సంపాదించినట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నిహారిక కొణిదెల ఆస్తుల విలువ రూ.33 కోట్ల పైమాటే. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని నిహారిక గట్టి పట్టుదలతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











