Niharika Konidela: దానికోసమే రెండో పెళ్లి చేసుకుంటాను.. క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్!
కొణిదెల నాగబాబు కూతురిగా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల అల్లరి కూతురిగా.. మెగా డాటర్ గా మంచి పేరునే సంపాదించుకుంది నిహారిక కొణిదెల. మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి నటి ఈమెనే కాగా అందరూ బాగానే ఆదరించారు. ముందుగా టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి కెరియర్ లో దూసుకు పోతుంది. అయితే ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు ఓ సారి పెళ్లి అయింది. కానీ పెళ్లైన ఏడాదిన్నరకే విడాకులు తీసుకుని.. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే తాజాగా ఈమె రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసింది. తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని.. ఫ్యూచర్ లో దానికోసం అయినా సరే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నిహారిక కొణిదెల ఒక మనసు చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. మొదటి సినిమా హిట్ కాకపోయినా.. నటన పరంగా మాత్రం మంచి పేరే తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ తో అంతకు మించిన క్రేజ్ దక్కించుకుని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. కేవలం సినిమాలు వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా.. ఇటీవలే నిర్మాతగా కూడా మారింది.
అయితే 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. పెళైన ఏడాదిన్నరకే వీరిద్దరూ విడిపోయారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు కూడా. ఆ తర్వాత నుంచి మెగా డాటర్ తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తాజాగా ఈమె తన రెండో పెళ్లిపై కామెంట్లు చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మీరు రెండో పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా... నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను కాబట్టి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత పిల్లల కోసం అని మాత్రమే కాదు.. కానీ చేసుకుంటానని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయితే తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని స్పష్టం చేసింది. అయితే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నప్పటికీ.. ఇప్పుడే అది జరగదని నిహారిక వివరించింది.
భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా రెండోసారి పెళ్లి చేసుకుంటానని నిహారిక వెల్లడించింది. దీంతో మెగా అభిమానులు అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓసారి దెబ్బ తిన్నా నిహారిక రెండో సారి మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నిహారిక తమిళంలో ఓ సినిమా చేసేందుకు సైన్ చేసింది. త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది.


Click it and Unblock the Notifications











