ఆనందాన్ని వెతుక్కుంటున్నా... నిహారిక కొణిదెల షాకింగ్ పోస్ట్
మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ అక్కడ సక్సెస్ కాకపోవడంతో నిర్మాతగా అవతారమెత్తి విజయాలు అందుకుంటున్నారు. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాత అనిపించుకోవడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్ధర్ అవార్డ్ సైతం అందుకున్నారు. నిర్మాతగా తన అభిరుచికి తగిన సినిమాలు తీస్తూ భారీ చిత్రాల దిశగా అడుగులు వేస్తున్నారు నిహారిక కొణిదెల.
హోస్ట్ నుంచి హీరోయిన్‌గా
2015లో ఢీ జూనియర్స్‌కు హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక కొణిదెల.. ఆ తర్వాతి సంవత్సరం ఒక మనసు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి, డార్లింగ్, చిత్రాలలో నటించారు. అప్పటికే తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించిన నిహారిక ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించారు.

చైతన్యతో పెళ్లి, విడాకులు
కాగా.. 2020లో రాజస్థాన్‌లో ప్రముఖ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అట్టహాసంగా జరిగింది. రెండేళ్ల పాటు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో పరస్పర అంగీకారంతో 2023 జూలైలో విడాకులు తీసుకున్నారు. నాటి నుంచి నిహారిక ఒంటరిగానే జీవిస్తూ తన సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందని పలుమార్లు రూమర్స్ వైరల్ కాగా.. తర్వాత అవన్నీ గాలివార్తులగా మిగిలిపోయాయి.
కమిటీ కుర్రోళ్లతో హిట్
గతేడాది కమిటీ కుర్రోళ్లు చిత్రంతో సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన నిహారిక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. స్క్రీన్ ప్లే- డైలాగ్స్‌ను మానస శర్మ, మహేశ్ ఉప్పాల అందించారు. ఈ సినిమాకు మన్యం రమేశ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. జూలై 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, గెటప్ శ్రీను, వాసు ఇంటూరి, జబర్దస్త్ రోహిణి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా పనుల్లో ప్రస్తుతం నిహారిక బిజీగా ఉన్నారు. ఈ ఏడాది తమిళంలో మద్రాస్కరన్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిహారిక.. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నారు.
అక్కడ చిల్ అవుతోన్న మెగా డాటర్
షూటింగ్స్, సినిమాలకు విరామం దొరికినప్పుడు నిహారిక తన స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మెగా డాటర్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్స్‌తోనూ ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా నిహారిక పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈశాన్య భారతదేశంలోని మేఘాలయాలో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు నిహారిక. దీనిలో భాగంగా అక్కడి సన్‌సెట్‌ను ఆస్వాదించారు. సన్‌సెట్‌ను వెంటాడుతూ నా హృదయానికి ఆనందాన్ని కలిగిస్తున్నానంటూ నిహారిక చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











