Niharika Konidela: "నేను సినిమాలు చేసేది అందుకే.. అలాంటి ఒక్క ఆఫర్ కూడా రాలేదు"
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు అంతకి మించిన క్యూట్ నెస్ కల్గిన ఈ బ్యూటీ.. ఈ మధ్య పూర్తిగా కెరియర్ పైనే ఫోకస్ చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తాను అసలు సినిమాలు చేయడానికి కారణాలు వివరించింది. అలాగే స్టార్ హీరోయిన్ అయ్యే అందాలు కల్గిన ఈమె దాని మీద అంతగా ఫోకస్ చేయకపోవడానికి గల కారణాలను కూడా వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారికనే. అయితే 2016లో ఒక మనసు చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ క్యూట్ బ్యూటీ. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనను కనబర్చి మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమా చాలా మందికి నచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం హిట్టు కొట్టలేకపోయింది. అయినప్పటకీ ఆమె యాక్టింగ్ అదిరిపోయిందంటూ.. ఆమెకు మంచి ప్యూచర్ ఉందంటూ చాలా మంది కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరికొన్ని చిత్రాల్లోనూ మెరిసింది.

దాదాపుగా ఐదు సినిమాల్లో నటించిన ఈమె.. పలు వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తూ సందడి చేసింది. ఇటీవలే ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించి సినిమాలు నిర్మించేందుకు సిద్ధం అయింది. మరోవైపు మలయాళంలో ఓ సినిమా చేసేందుకు కూడా ఓకే చెప్పింది. ఇలా ఫుల్ బిజీగా గడుపుతున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసింది. అసలు తాను సినిమాలు ఎందుకు చేస్తుందో ఇప్పుడే వివరించింది.
తాను పెద్ద స్టార్ హీరోయిన్ ను అయిపోవాలని సినిమాలు చేయట్లేదని.. కేవలం తనకు నచ్చి, తనకు హ్యాపీనెస్ ను ఇచ్చే సినిమాలు మాత్రమే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. మెగా కుటుంబంలో పుట్టిన తాను సినిమా చేస్తానని చెప్తే.. చాలా మంది డైరెక్టర్లు క్యూలో నిల్చునే ఛాన్స్ ఉన్నా... తాను ఒక్కరి వద్దకు కూడా వెళ్లలేదని చెప్పుకొచ్చింది. దర్శకులు రాసుకున్న కథకు తాను సెట్ అవుతానని భావించి తన వద్దకు వస్తే మాత్రమ తాను కథలు వింటానని చెప్పేసింది.

అలాగే తన వద్దకు ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సినిమా కూడా రాలేదని తొలిసారి క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తనకు నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెబుతానని.. అప్పుడు కూడా తాను హ్యాపీగా ఫీల్ అవుతానని భావిస్తేనే ముందుకు వెళ్తానని వివరించింది. పెద్ద రోల్ కాకపోయినా ఇటీవలే మలయాళ సినిమాకు ఓకే చెప్పడానికి కారణం ఇదేనని తెలిపింది.


Click it and Unblock the Notifications











