బికినీలో నిహారిక కొణిదెల ఊహించని వీడియో.. ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ రొమాంటిక్ పోజులు
తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఈ బ్యూటి మొదట్లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. అనంతరం తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దగుమ్మ. నిహారిక నటన బాగున్నప్పటికీ ఆమె చేసిన సినిమాలు మాత్ర హిట్టు ఇవ్వలేకపోయాయి. ఇటీవలే మళ్లీ యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన ఈ సుందరి తాజాగా బికినీలో దర్శనం ఇచ్చి అట్రాక్ట్ చేసింది.
అందరి దృష్టి:టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబంలో ఒకటి అయిన మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయమైన ఏకైక బ్యూటి నిహారిక కొణిదెల. నాగబాబు ముద్దుల కూతురిగా 'ఢీ' డ్యాన్స్ షోతో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన మాటలతో మెప్పించిన ఈ బ్యూటి ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. అప్పుడప్పుడు పలు షోలలో గెస్టుగా వచ్చి పంచులు, ప్రాసలతో కామెడీ చేసి అందరి దృష్టి పడేలా చేసింది.

వర్కౌట్ కాకుండా:తర్వాత కొన్ని రోజులకు నిహారిక కొణిదెల 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించడంతో పాటు నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటి 2016లో 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తెరంగేట్రం చేసిన నిహారిక కొణిదెలకు కెరీర్ పరంగా వర్కౌట్ కాలేదు.

చివరి మూవీ:తొలి మూవీ ఒక మనసు డిజాస్టర్ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది నిహారిక కొణిదెల. కానీ, ఇవి కూడా ఆమెకు అంతగా విజయాన్ని అందించలేకపోయాయి. నిహారిక కొణిదెల హీరోయిన్ గా చివరిగా ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాలో నటించింది. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది.

లేని క్లారిటీ :అయితే ఈ మధ్య కాలంలో నిహారిక, చైతన్య విడిపోయారనే వార్తలు తెగ వస్తున్న విషయం తెలిసిందే. వాటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు గానీ, నిహారిక మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. నిహారిక తాజాగా నటించిన వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

టచ్ లో ఉంటూ:ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలు, ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల. ఈ క్రమంలోనే ఆమె ఎంజాయ్ చేసే వెకేషన్స్, ఫ్రెండ్సుతో టూర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది.

వివిధ ఫొటోలు, భంగిమలు:ముద్దగుమ్మ నిహారిక తాజాగా కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. వితికా షెరు, మహాతల్లి ఫేమ్ జాహ్నవితో కలిసి ఫారెన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది నిహారిక. ఈ క్రమంలోనే బికినీ ధరించి వాటర్ ఫాల్ వద్ద అందాలు ఆరబోసిన వీడియో పంచుకుంది. దీనిలో చిరుగాలికి ఆమె బ్యాక్ అందాలు ఆకర్షణీయంగా కనువిందు చేశాయి. మరికొన్ని ఫొటోల్లో రొమాంటిక్ పోజుల్లో ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ ఎద అందాలు ప్రదర్శించింది.


Click it and Unblock the Notifications











