వెరీ హాట్ గురూ: షర్ట్ బటన్ విప్పేసి షాకిచ్చిన నిహారిక.. మెగా డాటర్ రచ్చ మామూలుగా లేదుగా.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి దాదాపు పది మంది హీరోలు రావడంతో పాటు ఓ హీరోయిన్ కూడా ఎంటర్ అవడమే. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక.. కొన్నేళ్ల క్రితం బుల్లితెరపై బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'కు యాంకర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్‌లో పాల్గొంది. అక్కడ చేసింది తక్కువ షోలే అయినా ఎక్కువ గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ప్రవేశించింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ హాట్ ఫొటో చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఏంటా మేటర్.?

మెగా డాటర్ నిహారికకు దారుణమైన రిజల్ట్

మెగా డాటర్ నిహారికకు దారుణమైన రిజల్ట్

నిహారిక కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి ఎంటర్ అయింది. యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఒక మనసు' అనే సినిమాతో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే, నిహారిక మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది. ఈ క్రమంలోనే ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' వంటి సినిమాలతో వచ్చినా అవేమీ హిట్ కాలేదు. దీంతో ఈ మెగా డాటర్ హీరోయిన్‌గా నటించడం మానేసింది.

ప్రతిష్టాత్మక చిత్రంతో కోరిక తీర్చుకుంది

ప్రతిష్టాత్మక చిత్రంతో కోరిక తీర్చుకుంది

హీరోయిన్‌గా చేసిన సినిమాలన్నీ దారుణమైన పరాజయాలను మూటగట్టుకోవడంతో నిహారిక అప్పటి నుంచి మరే ప్రాజెక్టునూ చేయలేదు. అయితే, గత ఏడాది వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి'లో మాత్రం చిన్న పాత్రలో కనిపించింది. ఎప్పటికైన తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలన్న కోరికను ఈ సినిమా ద్వారా తీర్చుకుంది నిహారిక.

అక్కడ మాత్రం సూపర్ సక్సెస్ అవుతోంది

అక్కడ మాత్రం సూపర్ సక్సెస్ అవుతోంది

సినిమాల్లో తనకు కలిసి రాకపోవడంతో నిహారిక.. తనకు గుర్తింపును అందించిన వెబ్ సిరీస్‌ల వైపు వెళ్లింది. తనను తాను నిరూపించుకునేందుకు గతంలో ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించి ‘ముద్దపప్పు ఆవకాయ్', ‘నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లతో ముందుకు వచ్చింది. ఇవి సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం ఆమె ‘మ్యాడ్ హౌస్' అనే సిరీస్‌ను నిర్మించింది.

కుర్ర హీరోలతో పోటీ పడుతున్న నిహారిక

కుర్ర హీరోలతో పోటీ పడుతున్న నిహారిక

సినిమాలు.. వెబ్ సిరీస్‌లు.. టీవీ షోలతో నిత్యం ఫ్యాన్స్‌ను మెప్పించిన నిహారిక.. సోషల్ మీడియా ద్వారానూ వాళ్లతో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఆమె కుర్ర హీరోలతో పోటీగా 1.2 మిలియన్ ఫాలోవర్లను సంపాదించింది.

మెగా డాటర్ రచ్చ మామూలుగా లేదుగా.!

మెగా డాటర్ రచ్చ మామూలుగా లేదుగా.!

కొద్ది రోజులుగా మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు డీసెంట్‌ లుక్‌లో కనిపించిన ఈ అమ్మడు.. కొద్ది రోజుల నుంచి హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. వరుసగా ఫొటోలను వదులుతూ హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఎన్నడూ కనిపించనంత హాట్‌గా ఆ ఫొటోలలో దర్శనమిస్తుండడంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Mega Daughter Niharika Konidela To Quit Movies ? || Filmibeat Telugu

షర్ట్ బటన్ విప్పేసి షాకిచ్చిన నిహారిక


ఇక, తాజాగా నిహారిక మరో హాట్ ఫొటోను వదిలింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షర్ట్ బటన్స్ తీసేసి ఉన్న ఈ ఫొటోలో ఆమె ఎద అందాలతో కనువిందు చేస్తోంది. అంతేకాదు, ఈ పిక్‌లో నిహారిక ముఖంపై చిరునవ్వు కనిపిస్తోంది. అందుకే దీనికి ‘మిమ్మల్ని ఏది నవ్విస్తుంది' అనే క్యాప్షన్ జోడించింది. చాలా హాట్‌గా ఉన్న ఈ ఫోటో కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X