ఆ మెగా హీరోతో సినిమా ప్లాన్..నిహారిక డ్రీమ్ ప్రాజెక్ట్ మామూలు లేదుగా

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, తన కెరీర్‌ను చిన్న స్థాయి ప్రాజెక్ట్‌లతో ప్రారంభించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె నటిగా కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతోంది. ఇటీవల ఆమె నిర్మాణంలో రూపొందుతున్న కొత్త సినిమా 'రాకాసా' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు మానస శర్మ రూపొందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో నిహారిక బిజీగా పాల్గొంటున్నారు.

ఇదిలా ఉండగా, గత కొన్ని రోజులుగా నిహారిక తన అన్నయ్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమార్స్ పై నిహారిక స్పందించారు. ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ 'మీ ఫ్యామిలీ నుంచి ఎవరినైనా మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏ హీరోతో సినిమా చేస్తారు?' అని అడగగా ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. ఎలాంటి సందేహం లేకుండా 'నా ఫస్ట్ ఆప్షన్ రామ్ చరణ్ అన్నే'అంటూ ఆసక్తిని రేపింది.

Niharika Konidela s Dream Project with Ram Charan Mega Daughter Reveals Her Big Plan

నిహారిక మాట్లాడుతూ.. 'చరణ్ అన్నతో సినిమా చేయాలని ఉంది. అవకాశం వస్తే నేను ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తా' అని స్పష్టం చేసింది. అంతేకాదు, ఎలాంటి కథతో సినిమా చేయాలను కుంటున్నారు అనే ప్రశ్నకు కూడా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. రంగస్థలం (Rangasthalam) లాంటి ఒక కొత్త కాన్సెప్ట్‌తో, రూట్ లెవెల్ స్టోరీ లేదా ధ్రువ (Dhruva) లాంటి స్టైలిష్ కాప్ స్టోరీ చేయాలని ప్లాన్ చేస్తా' అని చెప్పింది. దీంతో నిహారిక ప్లానింగ్ ఎంత క్లియర్‌గా ఉందో అర్థమవుతోంది.

ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడిన నిహారిక, ఆయన సినిమాల ఎంపికలో ఉన్న ప్రత్యేకతను కూడా హైలైట్ చేసింది. 'చరణ్ ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని చూస్తారు. ఒకే తరహా పాత్రలు చేయకుండా, ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటారు' అని చెప్పింది. నిజంగానే చరణ్ కెరీర్‌ను గమనిస్తే, కమర్షియల్ నుంచి ఎక్స్‌పెరిమెంటల్ వరకూ విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక రాబోయే సినిమాల విషయానికొస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. 'త్వరలో రాబోతున్న 'పెద్ది' సినిమా కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. అలాగే సుకుమార్ గారితో చేయబోయే సినిమా కూడా పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ఉంటుంది' అని నిహారిక హింట్ ఇచ్చింది.

దీంతో చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై మరింత హైప్ క్రియేట్ అయింది. నిహారిక-రామ్ చరణ్ కాంబో నిజంగా సెట్ అయితే, అది టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది కేవలం ఆలోచన దశలో ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్ ఎప్పుడు రియాలిటీ అవుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X