మెగా డాటర్‌కు క్రేజీ ఆఫర్.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ రీమేక్‌లో!
శ్రద్ధాకపూర్ కీలక పాత్రలో నటించిన స్త్రీ చిత్రం ఘన విజయం సాధించింది. బాలీవుడ్ వర్గాలకే షాక్ ఇస్తూ హర్రర్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం 100 కోట్లు కొల్లగొట్టింది. దీనితో ఈ చిత్ర పరభాషా రీమేక్ హక్కులకు మంచి డిమాండ్ ఎరపడుతోంది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో సౌత్ దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.
తెలుగులో ఈ చిత్ర రీమేక్ విషయం తాజాగా వార్తల్లోకి వచ్చింది. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని నిర్మించిన కృష్ణ, రాజ్ నిడుమూరు తెలుగువాళ్లే కావడం విశేషం. దీనితో తెలుగులో ఈ చిత్రాన్ని తామే రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ కథకు సరిపడే హీరోయిన్ కోసం అన్వేషణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక పేరు తెరపైకి వచ్చింది. ఈచిత్రంలో నిహారిక నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు మొదలుపెట్టారని సమాచారం. నిహారిక ఓకే చేస్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని విశేషాలు బయటకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











