దానివల్ల అది కోల్పోయాను.. ఇక బోర్ కొట్టింది.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
హీరోయిన్ నికిషా పటేల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆమె పేరును చెబితే అంతగా గుర్తుండకపోవచ్చు గానీ.. పవన్ కళ్యాణ్ కొమురం పులి హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా ప్రభావం అంతటిది. తెలుగు ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బ కొట్టిన చిత్రం కావడంతో, ఆ సినిమాలో పవన్‌తో నికిషా రొమాన్స్ చేయడం.. ఆ సీన్స్‌ను మరిచిపోలేకపోవడం ఇలా నికిషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ భామ మళ్లీ వార్తల్లోకెక్కింది.

తమిళ, తెలుగు పరిశ్రమలో..
తమిళ తెలుగు పరిశ్రమలో దాదాపు 25 చిత్రాలను చేసినా తనకు గుర్తింపు రాలేదని వాపోతోంది నికిషా పటేల్. తెలుగు ప్రేక్షకులైతే తనను ఇంకా పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనే అంటున్నారని తెగ బాధపడుతోంది. అసలు నికిషాకు ఏమైంది? ప్రస్తుతం ఎక్కడుదంది? ఏం చేస్తుందన్నది ఓ సారి చూద్దాం.

ఇక బోర్ కొట్టింది..
తానిప్పటి వరకు తమిళం, తెలుగు భాషల్లో కలిపి 25 చిత్రాలు చేశానని.. ఇక బోర్ కొట్టేసిందని పేర్కొంది. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత బాగా చేసినా ఆ సినిమాలను వారు విమర్శిస్తూనే ఉన్నారు. అందుకే హిందీలో నటించేందుకు.. నటనల్ శిక్షణలో తీసుకునేందుకు లండన్ వచ్చానని తెలిపింది.

లండన్‌లో ప్రత్యేక శిక్షణ..
అందుకే తన నటను మెరుగు పరుచుకునేందుకు తన సొంతూరైన లండన్‌కు మకాం మార్చేసిందని చెప్పుకొచ్చింది. బ్రిటీష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఓ కోర్స్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇక్కడి చిత్ర పరిశ్రమ గురించి తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.

అది కోల్పోయాను..
తాను అనుకున్నట్లుగా అవకాశాలు రాకపోవడంతో తనలోని నటనను చూపెట్టే అవకాశాన్ని కోల్పోయానని తెలిపింది. తనకున్న చాన్స్‌ల్లోనే అడ్జస్ట్ కావాల్సి వచ్చిందని నాటి సంగతుల గురించి చెప్పుకొచ్చింది.
Recommended Video


అలానే పిలుస్తున్నారు..
మొదటగా అయితే కేవలం స్టార్స్‌తో మాత్రమే సినిమాలు చేయాలనుకున్నానని, బడ్జెట్ చిత్రాల్లోనే నటించాలని అనుకున్నట్లు తెలిపింది. ఆపై పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనే పిలుపు నుంచి బయటకు రావడానికి చాలా కాలమే పట్టిందని, తమిళ ప్రేక్షకులు తనను ఆదరించినా గానీ.. తెలుగువారు మాత్రం తనను అలానే పిలిచేవారని తన గోడును వెల్లిబుచ్చికుంది.


Click it and Unblock the Notifications











