పెళ్లయి పిల్లలున్న హీరోతో ఎఫైర్... సుఖం మోజులో బతుకు నాశనం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ అడుగడుగునా ఉచ్చులు, వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలు ఉంటాయి. వీటిని తట్టుకుని నిలబడాలి. అలా జీవితాలను గెలిచి, ప్రజల హృదయాలలో తెరవేల్పులుగా వెలుగొందిన వారెందరో. మరో రకం మనుషులూ ఇండస్ట్రీలో ఉంటారు. స్వయంకృతంతో చేజేతులా బంగారం లాంటి కెరీర్‌ను నాశనం చేసుకుంటారు. అలాంటి కోవలోకే వస్తారు ఈ నటి. అగ్రనటిగా వెలుగొందుతున్న దశలో.. పెళ్లయి పిల్లలున్న స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుని కెరీర్‌ను నాశనం చేసుకుంది. ఆమె ఎవరు? ఏ నటుడితో ఆమె ఎఫైర్ నడిపింది? ఆ నటి జీవితం చివరికి ఏమైంది? ఈ వివరాల్లోకి వెళితే..

చదువులో మెరిట్ స్టూడెంట్
ఆ నటి ఎవరో కాదు.. నిఖితా తుక్రాల్. వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ హాయ్, కళ్యాణ రాముడు, అనసూయ సినిమాలలో హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తారు. 6 జూలై 1981న ముంబైలో జన్మించారు నిఖిత. ఈమె ఉన్నత విద్యావంతురాలు.. చదువులో చిన్నప్పటి నుంచి మెరిట్‌ స్టూడెంట్ అనిపించుకున్నారట. ఎకనామిక్స్‌లో ఎంఏ చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నిఖిత కలలు కన్నారు. కానీ విధి ఆమెను నటన వైపు నడిపించింది.

Nikita Thukral and Darshan Thoogudeepa Releation Love Affair That Sparked the End of her Film Career

హాయ్‌తో టాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ దిగ్గజ నిర్మాత, మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు ఏదో పని నిమిత్తం ముంబై వెళ్లగా జుహులోని ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా నిఖితను చూశారు. ఆమె అందం, చలాకీతనం చూసిన రామానాయుడు.. ఆమెలో హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని గుర్తించి నిఖితను పిలిచి విషయం చెప్పారు. రామానాయుడు ఆఫర్‌కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిఖిత .. హాయ్ సినిమా ద్వారా తెలుగు తెరకు, సినీరంగానికి పరిచయమయ్యారు. ఈవీవీ సత్యనారాయణ కుమారుడు ఆర్యన్ రాజేష్‌కు కూడా హీరోగా ఇదే తొలి చిత్రం.

కన్నడంలో అగ్రనటిగా
హాయ్ చిత్రంలో నిఖిత అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఆమెకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. కన్నడంలో వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా అవతరించారు నిఖిత. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అవును 2, టెర్రర్ తదితర సినిమాలలో నటించారు. కెరీర్‌లో పీక్స్‌లో ఉండగా ఆమె వేసిన తప్పటడుగు నిఖిత నట జీవితాన్ని తలకిందులు చేసింది. కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్.. అభిమానిని చంపి ప్రస్తుతం జైళ్లో శిక్షను అనుభవిస్తున్న దర్శన్‌ తూగుదీపతో నిఖిత ప్రేమాయణం వ్యవహారం కన్నడ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.

దర్శన్‌తో ఎఫైర్
నిఖితతో ఎఫైర్ కారణంగా తన భర్త తనను దూరం పెడుతున్నాడని దర్శన్ భార్య విజయలక్ష్మీ ఏకంగా గృహ హింస కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి వరకు నిఖిత, దర్శన్‌ల ఎఫైర్ కేవలం కట్టుకథగా నమ్మిన వారికి విజయలక్ష్మీ కేసు షాకిచ్చింది. తనను కాల్చి చంపుతానని దర్శన్ గన్‌తో బెదిరిస్తున్నాడని భర్తపై విజయలక్ష్మీ బలమైన అభియోగాలు మోపింది. దీంతో దర్శన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్‌ కొన్నిరోజులు జైలు జీవితం గడిపాడు.

నిఖితపై బ్యాన్
అక్కడితో ఆగకుండా నిఖితకు మరో షాకిచ్చారు విజయలక్ష్మీ. తన భర్తతో ఎఫైర్ నడుపుతూ, తన కాపురంలో కలతలకు కారణమైందంటూ నిఖితపై కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్‌కు విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న నిర్మాతల మండలి.. నిఖితపై మూడేళ్లపాటు నిషేధం విధించింది. దాంతో నిఖితకు అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. తెలుగులోనూ ఛాన్స్‌లు దొరక్కపోవడంతో ఆమె కెరీర్ ముగిసింది. చివరిసారిగా 2018లో రాజసింహ అనే కన్నడ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం గగన్‌దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడి నటనకు గుడ్‌బై చెప్పింది. అలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నిఖిత కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఆమె జీవితం సినీరంగంలోకి అడుగుపెట్టే వర్ధమాన తారలకు ఓ పాఠమని విశ్లేషకులు చెబుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X