పెళ్లైన స్టార్‌ హీరోతో ఎఫైర్‌ .. సుఖం మోజులో కెరీర్ నాశనం.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

అక్రమ సంబంధాలు సమాజంలో చిచ్చు పెడుతున్నాయి. భార్యాభర్తలను విడదీయడమే కాదు .. ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు రోడ్డు పాలవుతున్నారు. ఇక విడాకుల సంగతి సరేసరి. ప్రియుడు/ ప్రియురాలి మోజులో విడిపోయి వాస్తవాలు గ్రహించేసరికి జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా దీనికి అతీతం కాదు. తాజాగా ఓ స్టార్ హీరోతో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్ తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..

దిగ్గజ దర్శకుడు, దిగ్గజ నిర్మాత చేతుల మీదుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి కెరీర్‌ను నిలబెట్టుకోవాల్సిన ఆమె స్టార్‌డమ్‌ను అందుకుని అంతే వేగంగా పాతాళానికి పడిపోయింది. ఆమె ఎవరో కాదు.. నిఖితా తుక్రాల్. ముంబైలో పంజాబీ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఎకనామిక్స్‌లో ఎంఏ చేశారు. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు కొడుతుందో తెలియదన్నట్లు.. ఎంతో మంది సినిమాల్లో అడుగుపెట్టడానికి దర్శక, నిర్మాతల అపాయింట్‌మెంట్ల కోసం పడిగాపులు కాస్తుంటారు. కానీ నిఖితకు మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది.

Nikita Thukral career spoiled due to affair with hero darshan thoogudeepa

దిగ్గజ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి. రామానాయుడు ఓ రోజున ముంబై వెళ్లగా ఆయన జుహులోని ఓ హోటల్‌లో భోజనం చేస్తుండగా నిఖితను చూశారు. ఆమె అందం, చలాకీతనం చూసిన ఆయన తన తదుపరి చిత్రం హాయ్‌లో హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుని నిఖితను సంప్రదించగా ఆమె ఎగిరి గంతేసింది. హాయ్ సినిమాతోనే దిగ్గజ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తన కుమారుడు ఆర్యన్ రాజేష్‌ను హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. తొలి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకున్నారు నిఖిత.

అనంతరం మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఆమెకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. తెలుగులో జోరు తగ్గినప్పటికీ తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో మాత్రం నిఖిత స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించారు. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో అవును 2, టెర్రర్ సినిమాలలో నటించారు నిఖిత. కానీ అవేవీ ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. కెరీర్‌లో పీక్స్‌లో ఉండగా కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ తూగుదీపతో ఆమె ఎఫైర్ నడిపినట్లుగా అప్పట్లో శాండల్‌వుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి.

వీటిని తొలుత గాసిప్స్‌గానే అంతా కొట్టిపడేశారు. అయితే దర్శన్ భార్య విజయలక్ష్మీ .. నిఖిత, దర్శన్‌ల రిలేషన్ నిజమేనంటూ బాంబు పేల్చారు. తనను దర్శన్ వేధిస్తున్నాడని, నిఖితతో సంబంధం పెట్టుకుని తనను కాల్చి చంపుతానని గన్‌తో బెదిరిస్తున్నాడని విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్శన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్‌కు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కొన్నిరోజులు జైళ్లో ఉండొచ్చాడు కూడా.

ఈ వివాదం నేపథ్యంలో నిఖితపై కన్నడ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడేళ్ల పాటు ఆమె సినిమాల్లో నటించడానికి వీల్లేదని బ్యాన్ విధించింది. దాంతో నిఖితకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఆ తర్వాత వయసు పెరగడం, కొత్త అమ్మాయిలు దూసుకురావడంతో సినిమాలకు దూరమైంది నిఖిత. చివరిసారిగా 2018లో రాజసింహ అనే కన్నడ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం గగన్‌దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడి లైఫ్‌లో సెటిలైంది. అలా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నిఖిత ఓ చిన్న తప్పుతో చేజేతులా కెరీర్‌ను నాశనం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X