twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్యాంట్‌లో చేతులు పెట్టుకొని.. బిగ్‌బాస్ పోరి యవ్వారం మాములుగా లేదే!

    |

    బిగ్ బాస్ రియాలిటీ షో 14లో ఇంటి సభ్యుల తీరు, ప్రవర్తన అత్యంత వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇంట్లో నిర్వహించే టాస్క్‌ల సమయంలో కంటెస్టెంట్లు వ్యవహరించే విధానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల కాలంలో హద్దులు మరిచి ఇంటి సభ్యుల ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దక్షిణాది హీరోయిన్ నిక్కి తంబోలి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఎలా స్పందించారంటే...

    హాట్ ఫిగర్‌గా నిక్కి తంబోలి

    హాట్ ఫిగర్‌గా నిక్కి తంబోలి

    సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 14లో హాట్ ఫిగర్ అంటే నిక్కి తంబోలి అనే విషయాన్ని తడుముకోకుండా చెప్పుకోవచ్చు. ఆమె అందాల ఆరబోత ప్రేక్షకులకు వినోదంగా మారింది. ఆమె వ్యవహరం ప్రతీసారి హాట్ టాపిక్‌గా మారింది. సభ్య సమాజం ఏం అనుకొంటుందనే విషయాన్ని పట్టించుకోకుండా బోల్డ్‌గా వ్యవహరిస్తున్నది.

    సల్మాన్ ఖాన్‌కే టెండర్

    సల్మాన్ ఖాన్‌కే టెండర్

    ఇక బిగ్‌బాస్ షోలో ప్రవేశించడంతోనే అదరగొట్టింది. సల్మాన్ ఖాన్‌కే టెండర్ వేసే ప్రయత్నం చేసింది. ఏకంగా సల్మాన్ ఖాన్ బుట్టలో పడేసేలా కటింగ్ ఇచ్చింది. దాంతో కండల వీరుడు ఓ దశలో షేక్ అయ్యాడు. వెంటనే ఇంటిలోకి పంపించి వేదిక మీద ఊపిరి పీల్చుకొన్నారు.

    బిగ్‌బాస్‌లో వేడి పుట్టించిన అందాల భామ

    బిగ్‌బాస్‌లో వేడి పుట్టించిన అందాల భామ

    బిగ్‌బాస్‌లో ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో నిక్కి తంబోలి చేసిన చేష్టలు వేడిని పుట్టించాయి. టాస్క్ సందర్భంగా మాస్క్‌ను తీసుకొని ప్యాంటులో పెట్టుకోవడం ఇంటి సభ్యులకు షాక్ తగిలింది. తన విపరీతమైన చేష్టలతో అప్పుడప్పుడు ఝలక్ ఇచ్చే కంటెస్టెంట్లకు తాజా ఘటన ముచ్చెటమలు పట్టించింది.

     ప్యాంటులో మాస్క్ పెట్టుకోవడంపై

    ప్యాంటులో మాస్క్ పెట్టుకోవడంపై

    ఇంటి సభ్యుల ముందే ప్యాంటులో మాస్క్‌ను పెట్టుకోవడంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. కోట్లాది మంది ఫ్యామిలీస్ చూసే షోలో ఇంత చీప్‌గా వ్యవహరిస్తుందా అంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. రకరకాల కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. చీప్ బిహేవియర్, షేమ్ షేమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    చీకటి గదిలో చిలక్కొట్టుడు చిత్రంతో

    చీకటి గదిలో చిలక్కొట్టుడు చిత్రంతో

    ఇదిలా ఉండగా, మోడల్‌గా రాణిస్తూ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నిక్కి తంబోలి. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో శృంగారపరమైన పాత్రతో హాట్ హాట్‌గా నటించింది. ఆ తర్వాత కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలుగు సినిమాకు దూరమైంది.

    English summary
    Nikki Tamboli appeared again in headlines during the Bigg Boss Hindi 14. Nikki Tamboli hide the mask in Pants in Bigg Boss 14 show in front of Rahul Vaidya. This goes contraversial in the social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X