టాలీవుడ్ హీరోయిన్ సోదరుడు మృతి.. కరోనాకు బలి.. చేతులెత్తి మొక్కినా తప్పని మరణం

టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. కరోనావైరస్ బారిన పడిన సోదరుడు మృత్యువాత పడటంతో ఆమె కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. తన సోదరుడి మరణం విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో నిక్కి తంబోలి చేసిన పోస్టు ఏమిటంటే..

లాక్‌డౌన్‌లో పెంపుడు కుక్కతో అందాల భామ.. రోడ్డుపై యదేచ్ఛగా గ్లామర్ షో

టాలీవుడ్ హీరోయిన్‌గా

టాలీవుడ్ హీరోయిన్‌గా

నిక్కి తంబోలి విషయానికి వస్తే.. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె పండించిన గ్లామర్ హాట్ హాట్ టాపిక్ అయింది. తాజాగా సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరించిన బిగ్‌బాస్ 14లో పాల్గొన్నారు. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చి కెరీర్‌పై దృష్టి సారించిన నిక్కి తంబోలికి తీవ్ర విషాదం ఎదురైంది. కొద్ది రోజుల క్రితం తన సోదరుడికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. నా సోదరుడి అరోగ్య పరిస్థితి కష్టంగా ఉంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ ఇటీవల తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

నా సోదరుడు ఆరోగ్య సమస్యలతో

నా సోదరుడు ఆరోగ్య సమస్యలతో

నా సోదరుడికి కేవలం 29 ఏళ్లు మాత్రమే. కొద్ది సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించాం. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి. కేవలం ఒకే ఒక ఊపిరితిత్తితో మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించండి అంటూ వేడుకొన్నారు. అయితే ఊహించని విధంగా తన సోదరుడు ఇక లేరంటూ ఎమోషనల్‌గా పోస్టు చేశారు.

 దేవుడు నీ వద్దకు పిలిచారని...

దేవుడు నీ వద్దకు పిలిచారని...

తన సోదరుడి మరణంపై ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా స్పందిస్తూ.. దేవుడు నిన్ను ఆయన వద్దకు పిలుచుకొంటారని ఊహించలేదు. ఇంత త్వరగా మమల్ని విడిచి వెళ్తావని ఊహించలేదు. నీవు ఒంటరిగా వెళ్లడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ నిక్కి తంబోలి ఆవేదన వ్యక్తం చేశారు.

 జీవితాంతం గుర్తుండేలా ప్రేమను పంచి..

జీవితాంతం గుర్తుండేలా ప్రేమను పంచి..

మా నుంచి నీవు దూరమైనప్పటికి మాకు ఈ జీవితాంతం గుర్తుండిపోయే జాపకాలను మిగిల్చావు. నీ ప్రేమ మమల్ని ముందుకు నడిపిస్తుంది. మన బంధం ఇలా అర్ధాంతరంగా తెగిపోతుందని ఊహించలేదు. చివరి చూపుకు కూడా నోచుకోకుండా మమల్ని వదిలి వెళ్లడం మీకు న్యాయమా అంటూ నిక్కి తంబోలి స్పష్టం చేశారు.

 నిక్కి తంబోలికి సన్నిహితుల సంతాపం

నిక్కి తంబోలికి సన్నిహితుల సంతాపం

నీవు మమల్నే కాదు.. ఎంతో మందిని వదిలివెళ్లావు. త్వరలోనే మా కుటుంబంలోకి నీవు రావాలి. నా జీవితంలో గొప్ప సోదరుడిని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుడిని కోరుకొంటున్నాను. నీవు లేని లోటు ఎప్పటికీ తీరదు అంటూ నిక్కి తంబోలి తన లేఖలో పేర్కొన్నారు. సోదరుడిని కోల్పోయిన నిక్కి తంబోలికి అభినవ్ శుక్లా, అలీ గోని, రాహుల్ మహాజన్, సిద్ధాంత్ కపూర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X