నిక్కి తంబోలికి కరోనావైరస్.. బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే షాక్
తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఉత్తరాది భామ నిక్కి తంబోలి కరోనావైరస్ కోరల్లో చిక్కుకున్నది. మహారాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరిస్థితులు వెంటాడుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇటీవల కరోనా బారిన పడటం తెలిసిందే. తాజాగా నిక్కి తంబోలి ఆ జాబితాలో చేరారు. ఆమె ఇటీవల అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షలు జరిపించారు. దాంతో ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
తనకు కరోనావైరస్ సోకిన విషయాన్ని స్వయంగా నిక్కి తంబోలి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ చికిత్సలో ఉన్నాను. ఇటీవల కాలంలో నాతో కలిసి ఉన్న వాళ్లందరూ దయచేసి కోవిడ్ పరీక్షలు జరిపించుకోవాలని కోరుతున్నాను అని నిక్కి తంబోలి ట్వీట్ చేసింది.

ఇక నిక్కి తంబోలి కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగపెట్టింది. ఆ తర్వాత తిప్పరా మీసం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన నిక్కి ఇటీవల బిగ్‌బాస్ షో ద్వారా అత్యంత ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్నారు.


Click it and Unblock the Notifications











