twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ కరోనా టెన్షన్..నాకు పాజిటివ్ వచ్చింది.. మీరు జాగ్రత్త అంటున్న టాలీవుడ్ హీరోయిన్

    |

    దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా, సినీ ప్రపంచంలోని చాలా మంది తారలు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కీ తంబోలి తాను కరోనా బారిన పడినట్టు వెల్లడించింది. తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు ఆమె తెలియజేసింది. దీనితో పాటు, ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాలని, మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ను పంచుకుంటూ, నిక్కీ తంబోలి ఇలా రాశారు, 'నా కరోనా రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది.

    నాకు కోవిడ్ 19 తీవ్రమైన లక్షణాలు వచ్చాయి. దీంతో నన్ను నేను ఐసోలేట్ చేసుకున్నాను. అంతేకాక మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని పేర్కొంది. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ, వీలైనంత త్వరగా తమ పరీక్షను పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. దీంతో పాటు ముందుగా మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాని పేర్కొంది. నిక్కీ తంబోలి షేర్ చేసిన పోస్ట్‌పై అభిమానులు కామెంట్ చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇక వారితో పాటు బిగ్ బాస్‌లో భాగమైన అభినవ్ శుక్లా కూడా కామెంట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్టు కామెంట్ చేశారు.

    Nikki Tamboli tests Covid-19 positive again

    నిజానికి నిక్కీ తంబోలి ఇప్పటికే 2021లో కూడా కరోనా బారిన పడింది. ఆ సమయంలో కూడా, నిక్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా సమాచారం ఇచ్చింది. నిక్కీ తంబోలి సినిమాల గురించి చెప్పాలంటే ఆమె 2019లో తెలుగు హారర్ కామెడీ చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత చాలా సౌత్ సినిమాల్లో నటించింది. ఇక ఆమె 'బిగ్ బాస్ 14'లో kuda కనిపించింది. ఆ తర్వాత ఆమె 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో కూడా కనిపించింది. నిక్కీ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. తన కొత్త కారు ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో నిక్కీ తంబోలితో పాటు ఆమె తండ్రి కూడా ఉన్నారు. కారు ఆకారంలో ఉండే కేక్‌ని కూడా కట్‌ చేశారు.

    English summary
    Nikki Tamboli has tested positive for COVID-19. On Saturday, Nikki took to Instagram and shared her health update.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X