52 ఏళ్ల వయసులోనూ యాపిల్ పండులా మెరిసిపోతున్న హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా!
పండు... ఒకప్పటి సినిమాలో ఈ పేరుతో కుర్రకారు మదిని దోచిన ముద్దుగుమ్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పెట్టిన ఈ ముద్దు పేరుతో పిలుస్తుంటేనే విసుక్కుంటూ తెగ సందడి చేసిన టబు అందరికీ గుర్తిండే ఉంటుంది. నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున సరనస నటించిన ఈమె పేరు మహాలక్ష్మీ అలియాస్ పండుగా కనిపించి కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా వచ్చి 27 ఏళ్ల అవుతున్నా ఈ చిత్రాన్ని, హీరోయిన్ ను ఇంకా ఎవరూ మర్చిపోలేరు.
అద్భుతమైన అందంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ హైదరాబాద్ అమ్మాయి.. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది. కూలీ నెంబర్ వన్ సినిమాతో తెలుగు సినీ రంగంలో హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత అనేక అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాళీ భాషల్లో కూడా నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. మొదట్లో కాస్త బ్రేకులు ఇస్తూ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ 1994 నుంచి మాత్రం ఎక్కడా ఆగకుండా సినీ రంగంలో రాణిస్తోంది.

ఓవైపు వరుసగా చిత్రాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తుది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన అందమైన హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే చీర కట్టుతో కుర్రకారు మదిని దోచేస్తోంది. బ్లాక్ కలర్ చంకీల చీర కట్టుకుని న్యూడ్ మేకప్ లుక్ లో దర్శనం ఇచ్చింది.

ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ వేసుకున్న టబు చీరకు గ్రీన్ కలర్ చంకీలు ఉన్నాయి. ఆ చంకీలు అందంగా మెరిసిపోతుండగా.. హాట్ హాట్ ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. అలాగే చెవులకు పెద్ద కమ్మలు పెట్టుకుని మరింత స్టైలిష్ గా కనిపించింది. వైట్ కలర్ స్టోన్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న టబు.. ఈ డైమండ్ రింగ్స్ తో మరింత అందంగా కనిపిస్తోంది. టబు షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











