నన్ను సావిత్రితో పోల్చారు.. తప్పని పరిస్థితుల్లోనే మహానటి వదులుకున్నా!
ప్రస్తుతం సౌత్ లో అద్భుతమైన నటన ప్రదర్శించగల నటీమణుల్లో నిత్యామీనన్ కూడా ఒకరు. తన హావభావాలతోనే సన్నివేశాన్ని పడించగలదు. ఈ ఏడాది విడుదలైన మహానటి చిత్రంతో సావిత్రి జీవిత చరిత్రని ఈ తరం ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించారు. సావిత్రిగా కీర్తి సురేష్ నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం, పైగా మహానటి పాత్ర... దీనికోసం దర్శకుడు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. మహానటిలో మొదట నిత్యామీనన్ కు అవకాశం దక్కిందట. ఈ విషయాన్ని నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

సావిత్రితో
నా నటన చూసి చాలా మంది ప్రశంసించేవారు. మరి కొందరైతే తాను సావిత్రిలా నటిస్తానని తెలిపేవారు. వారి మాటలు విన్నపుడు చాలా సంతోషంగా అనిపించేది. మహానటి అద్భుతమైన చిత్రం. ఆ చిత్రంలో నటించే అవకాశం మొదట నాకే దక్కింది.

ఛాన్స్ మిస్
సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. వెంటనే ఆ సినిమాని అంగీకరించా. కానీ అనుకోని కారణాల వలన ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నా అని నిత్యామీనన్ తెలిపింది. ఎందుకు వదులుకున్నానో కారణాలు మాత్రం చెప్పలేనని నిత్యామీనన్ తెలిపింది.

కీర్తి సురేష్‌కు ఛాన్స్
నిత్యామీనన్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో దర్శకుడు నాగ అశ్విన్ కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నాడు. కీర్తి సురేష్ తన నటనతో మరో మారు సావిత్రిని కాళ్ళ ముందు ఆవిష్కరించింది. మహానటి చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.

ఎన్టీఆర్ బయోపిక్
ఎన్టీఆర్ బయో పిక్ లో కూడా బసవతారకం పాత్రలో నటించే అవకాశం నిత్యామీనక్ కు వచ్చిందనే వార్తలు ఉన్నాయి. కానీ చివరకు చిత్ర యూనిట్ బాలీవడ్ నటి విద్యాబాలన్ ని ఎంపిక చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











