twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరో, హీరోయిన్ల పెళ్లికి కారణం నేనే.. వారిద్దరూ నా వల్లే ప్రేమలో.. నిత్య మీనన్

    |

    అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడమే కాదు.. తోటి నటీనటులు ప్రేమలో ప్రేమలో పడటానికి నిత్యమీనన్‌ కారణమనే ఆలస్యంగా బయటపడింది. వెండితెర మీద ప్రేమలో పడటమే కాకుండా నిజజీవితంలో ప్రేమలో పడటానికి, వారికి ఈ టాలెంటెడ్ యాక్టర్ అండగా నిలిచిన విషయం బయపడింది. మలయాళ ఇండస్ట్రీలో టాప్ హీరో ఫాహద్ ఫాజిల్, నాజ్రియా నాజిమ్ ప్రేమ ఫలించడానికి కారణం నిత్య మీనన్ అట. అంతేకాకుండా వారి పెళ్లి జరగడానికి కూడా తానే కారణమని ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల నిత్య మీనన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

    బెంగళూరు డేస్ షూటింగ్‌లో

    బెంగళూరు డేస్ షూటింగ్‌లో

    బెంగళూరు డేస్ అనే చిత్రంలో నటించేటప్పుడు నాజ్రియా, ఫాహద్ ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో పరిచయం ప్రేమగా మారి మరో బంధంగా బలపడటానికి ఆ షూటింగ్ కారణమైంది. ఈ సమయంలో వారిద్దరి ప్రేమ గురించి నాకు తెలిసింది. వారిద్దరూ తమ ప్రేమను గురించి నాకు చెప్పగా.. నేను వారికి ప్రోత్సాహించాను అని నిత్యామీనన్ వెల్లడించింది.

    వేరే కమిట్‌మెంట్స్‌ కారణంగా

    వేరే కమిట్‌మెంట్స్‌ కారణంగా

    వాస్తవానికి బెంగళూరు డేస్‌లో హీరోయిన్ క్యారెక్టర్‌ను నాకే ముందు ఆఫర్ చేశారు. కానీ నేను వేరే కమిట్‌మెంట్స్ వల్ల సినిమా చేయలేకపోయాను. ఒకవేళ నేను చేసి ఉంటే నాజ్రియా, ఫాహద్ ప్రేమలో పడేవారు కాదేమో. వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడానికి నేనే కారణం కదా అని నవ్వుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.

    కుర్ర హీరోతో నిత్యా మీనన్ రొమాన్స్.. అలా కాంప్రమైజ్ అయ్యారట!కుర్ర హీరోతో నిత్యా మీనన్ రొమాన్స్.. అలా కాంప్రమైజ్ అయ్యారట!

    హీరోయిన్‌గా ఒప్పుకోకపోవడం వల్లే

    హీరోయిన్‌గా ఒప్పుకోకపోవడం వల్లే

    హీరోయిన్‌గా ఒప్పుకోకపోవడంతో నిత్యామీనన్‌ను తన సినిమాలో నటించాలని డైరెక్టర్ అంజలి మీనన్ కోరగా.. ఆ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది. అలా నాజ్రియా, ఫాహద్ ప్రేమలో పడటం, వారికి తన వంతుగా సహకారం అందించడానికి వెసులుబాటు కలిగింది. స్టార్ హీరోయిన్‌గా నాజ్రియా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. అయితే పెళల్ి తర్వాత మళ్లీ 2018లో కూడే అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

    నిత్యా మీనన్ కెరీర్ గురించి

    నిత్యా మీనన్ కెరీర్ గురించి

    నిత్యామీనన్ కెరీర్ విషయానికి వస్తే, మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ప్రాణ చిత్రంలో నటిస్తున్నది. కొలంబి, ఆనంద మార్గం అనే మలయాళ చిత్రాలను ఒప్పుకొన్నది. తమిళంలో జయలలిత బయోపిక్ ది ఐరెన్ లేడి, సైకో చిత్రాల్లో నటిస్తున్నది. హిందీలో అక్షయ్ కుమార్ చిత్రం మిషన్ మంగళ్ అనే చిత్రంలో, తెలుగులో రాజమౌళి RRR సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు.

    English summary
    Nithya Menen recently revealed about Nazriya Nazim and Fahadh Faasil marriage. Nitya Menen said, She was the reason for the their love and Marriage. They fell in love because, When she rejected heroine role in Bangalore. That offer goes Nazria. In that movie shoot, Both actors fall in love.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X