పిల్లల్ని కనడానికి పెళ్ళే చేసుకోవాలా?.. నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చేసే వ్యాఖ్యలు తరచుగా చర్చకు దారితీస్తుంటాయి. ఇక ఏదైనా బోల్డ్‌గా మాట్లాడరంటే చాలు క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. తాజాగా పెళ్లి, ప్రెగ్నెన్సీ వంటి అంశాలపై సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో దమ్మురేపుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలపై జాగ్రత్తగా మాట్లాడుతుంటే... ఈ హీరోయిన్ మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించింది. ఇంతకీ ఆమె చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకారం తేద . గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చే నిత్య, తన కెరీర్ ప్రారంభం నుంచే భిన్నమైన దారిని ఎంచుకుంది. 'అలా మొదలైంది'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, భీమ్లా నాయక్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా తన ప్రయాణం కొనసాగుతోంది. ఇటీవల ఆమె సినిమాలతో పాటు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. "కేయూరీ ప్రొడక్షన్స్" పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించి, నిర్మాతగా మారడం ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిత్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. పెళ్లి, ప్రెగ్నెన్సీ వంటి సున్నితమైన విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయాలకు భిన్నంగా ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి.'పిల్లలు కావాలనుకోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. దానికి పెళ్లి అనేది తప్పనిసరి కాదు' అని ఆమె స్పష్టం చేసింది. పిల్లలు కావాలనుకోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, దానికి వివాహం ఒక్కటే మార్గం కాదని ఆమె పేర్కొంది. ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సైంటిఫిక్ బోధనతోనే తల్లి కావచ్చని, ఒక మహిళకు తన శరీరం, తన జీవితం మీద పూర్తి హక్కు ఉందని ఆమె అభిప్రాయపడింది.
పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, అది తప్పనిసరి కాదు అని ఆమె అభిప్రాయం. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, సింగిల్ లైఫ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని చెప్పింది. నిత్యా చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి వివాదాస్పదంగా కనిపిస్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం ఆమె ఆలోచనలను సమర్థిస్తున్నారు. సమాజం పెట్టిన నియమాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి స్వయంగా నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తోంది. ఈ కామెంట్స్‌తో నిత్యామీనన్ మరోసారి తన ధైర్యం, స్పష్టతను నిరూపించింది. ముఖ్యంగా యువతలో వ్యక్తిగత స్వేచ్ఛ, జీవన నిర్ణయాలపై కొత్త చర్చకు దారితీసింది.
ప్రస్తుతం నిత్యామీనన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. కథలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా, ట్రెండ్‌ను సెట్ చేసే హీరోయిన్‌గా ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇలా నిత్యామీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక స్టేట్‌మెంట్ మాత్రమే కాదు... వ్యక్తిగత స్వేచ్ఛపై ఒక బలమైన సందేశంగా మారాయి.


Click it and Unblock the Notifications