కరోనా ఎఫెక్ట్ : వేలంలో హీరోయిన్ బట్టలు.. డ్రెస్‌తో పాటు అది కూడా..!!
కరోనా వైరస్‌ను ఎదురించేందుకు ప్రపంచమంతా పోరాడుతూనే ఉంది. కరోనా వైరస్ మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించగా.. ఎంతో మంది ఎన్నో రకాలుగాబాధలు పడుతున్నారు. తినడానికి తిండిలేక, ఉపాధి కోల్పోయి ఇలా ఎంతో మంది దీనావప్థలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతో మంది తమ ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా విరాళాలు అందిస్తూ.. సాయం చేస్తున్నారు. సినీ తారలంతా తమకు తోచిన సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సినీతారల విరాళాలు..
కరోనాపై పోరాటం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సినీ తారలు ఆర్థిక సాయం చేశారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరోలందరూ విరాళాలను ప్రకటించారు. మరికొంత మంది తారలు.. పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తూ అండగా నిలబడుతున్నారు.

హీరోయిన్ల వినూత్న ప్రయత్నం..
కొంత మంది హీరోయిన్స్.. పేదల ఆకలిని తీర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దినసరి కూలీలకు, వలస కార్మికులను అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరికొంతమంది హీరోయిన్స్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వారి వారి వస్తువులను వేలంవేసి.. దాని ద్వారా వచ్చిన డబ్బును మంచి పనులకు వినియోగిస్తున్నారు.

బట్టల వేలంలో నిత్యా మీనన్..
కరోనా పోరాటంలో తనవంతుగా నిత్యామీనన్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. ‘లాక్మే ఫ్యాషన్ వీక్‌లో నేను ధరించిన డ్రస్‌ను వేలం వేస్తున్నా. దీని ద్వారా వచ్చిన డబ్బులను అర్పణం ట్రస్ట్‌కి ఇస్తాను. ఈ ట్రస్ట్ గ్రామాల్లో పేద ప్రజలకు తమ కాళ్ల మీద తాము నిలబడానికి అవసరమైన సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నా కోసమే నా ఫ్రెండ్, డిజైనర్ కావేరి ఈ డ్రస్ డిజైన్ చేశారు.
Recommended Video

ఎక్కువ ధరకు..
డ్రెస్ కాకుండా.. నేను వ్యక్తిగతంగా రాసిన ఓ నోట్ కూడా అందిస్తాను. మే 16 ఆదివారం 4 గంటలకు వేలం ప్రారంభమవుతుంది. @indiawasted అనే సైట్‌లో ఆక్షన్ జరుగుతుంది. ఎవరైనా ఈ వేలంపాటలో పాల్గొని డ్రెస్‌ను సొంతం చేసుకోవచ్చు. అత్యధిక ధర చెల్లించిన వారికే తన డ్రెస్ దక్కుతుంద'ని తెలిపింది. మరోవైపు సోనాక్షి సిన్హా సైతం తన పెయింటిగ్స్‌ను వేలం వేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











