Bheemla Nayak లో నేను లేడీ పవర్ స్టార్‌ను.. పవన్ కల్యాణ్ ఎలాంటి వాడంటే? నిత్య మీనన్ కామెంట్స్ వైరల్

దక్షిణాదిలో టాలెంటెడ్ యాక్టర్ నిత్యా మీనన్ పలు భాషల్లో వరుసు చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం స్కైలాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వసున్న ఆమె శ్రీయ సరన్‌తో కలిసి గమనం అనే చిత్రంలోను, పవన్ కల్యాణ్‌తో భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నారు. స్కైలాబ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా భీమ్లా నాయక్ గురించి, పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. నిత్యా మీనన్ చెప్పిన విషయాల్లోకి వెళితే...

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ చేసి

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ చేసి

అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ చేస్తున్నామని త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ చేసి పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్నామని చెప్పారు. మీరు ఆ సినిమాలో ఓ పాత్ర చేయాలని అడిగారు. లేడీ పవన్ కల్యాణ్‌ వస్తుందని పవన్ కల్యాణ్‌కు చెప్పాను. మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని చెప్పారు. అయితే షూటింగు సమయంలో అలాంటి ఫీలింగ్ కలిగింది. పవన్ కల్యాణ్ చాలా మౌనంగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు అని నిత్యా మీనన్ చెప్పారు.

భీమ్లా నాయక్‌లో నా పాత్ర ఎలాంటిదంటే..

భీమ్లా నాయక్‌లో నా పాత్ర ఎలాంటిదంటే..


నేను స్పాంటేనియస్ యాక్టర్‌ని, నా స్వభావానికి తగినట్టుగా భీమ్లా నాయక్ పాత్ర ఉంది. ఆ పాత్ర చాలా మంచిగా అనిపించింది. భీమ్లా నాయక్ సినిమాలో నా రోల్‌కు సంబంధించిన షూట్ పూర్తి కాలేదు. ఇంకా ఒక పాట మిగిలి ఉంది. భీమ్లా నాయక్‌ సినిమాలో నటించడం మంచి ఎక్సీపీరియన్స్ అని నిత్యా మీనన్ తెలిపారు.

పవన్ కల్యాణ్‌కు స్కైలాబ్ గురించి చెబితే

పవన్ కల్యాణ్‌కు స్కైలాబ్ గురించి చెబితే


భీమ్లా నాయక్ సినిమా షూటింగులో స్కైలాబ్ సినిమా గురించి చెప్పాను. నేను నిర్మాతగా సినిమాను నిర్మిస్తున్నానని చెప్పడంతో ఆశ్చర్యంతోపాటు హ్యాపీగా ఫీలయ్యారు. నీవు ప్రొడ్యూస్ చేస్తున్నావా అని అడిగారు. ట్రైలర్ చూసి చాలా బాగుందని ప్రశంసించారు. స్కైలాబ్ సినిమా ఆసక్తికరంగా కొన్ని విషయాలను తెలుసుకొన్నారు అని నిత్య మీనన్ చెప్పారు.

6 సంవత్సరాలు గ్యాప్ లేకుండా

6 సంవత్సరాలు గ్యాప్ లేకుండా


తెలుగులో కొంచెం గ్యాప్ ఎక్కువైంది. ఏదో మొక్కుబడిగా నటించడం నా వల్ల కాదు. మెకానికల్‌గా ఎక్కువ సినిమాలు చేయడం రియల్ యాక్టర్స్‌కు సాధ్యం కాదు. నేను యాక్టర్‌ను అవుతానని అనుకోలేదు. కానీ ఆరేళ్లపాటు ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. చాలా అలిసిపోయినట్టుగా ఫీలయ్యాను. లాక్‌డౌన్‌లో కాస్త ఉపశమనం లభించింది అని నిత్యా మీనన్ అన్నారు.

అమెజాన్ కోసం వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా

అమెజాన్ కోసం వెబ్ సిరీస్‌లో నటిస్తున్నా


తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. నీవే అనే సాంగ్‌ను డైరెక్ట్ చేసిన దర్శకుడు ఈ సినిమాకు నిర్మాత. రాజమండ్రికి చెందిన ఓ యువతి కథగా ఉంటుంది. స్కైలాబ్‌కు సీక్వెల్ ఉంటుందని అనుకొంటున్నాను. కానీ కచ్చితంగా చెప్పలేం. స్కైలాబ్ ఒక మంచి అనుభూతిని కలిగించే సినిమా అవుతుంది అని నిత్యా మీనన్ చెప్పారు.

స్కైలాబ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

స్కైలాబ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: నిత్య మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తులసి, తనికెళ్ల భరణి తదితరులు
దర్శకుడు: విశ్వక్ ఖండేరావు
నిర్మాత: పృథ్వీ పిన్నంరాజు
సహ నిర్మాత: నిత్య మీనన్
సమర్పణ: డాక్టర్ కే రవికిరణ్
సినిమాటోగ్రఫి: ఆదిత్య
ఎడిటింగ్: రవి తేజ గిరిజాల
మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి
బ్యానర్స్: నిత్య మీనన్ కంపెనీ, బైట్ ఫీచర్స్
రిలీజ్ డేట్: 2021-12-04

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X