పెళ్లి అయితే మంచిదే.. కాకపోయినా పర్వాలేదు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖ నటి పెళ్లిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 37 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమే తప్ప అంతా కాదని స్పష్టం చేసింది. నిజమైన ప్రేమ దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని, ప్రస్తుతం మాత్రం సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. దీంతో ఇంతకీ పెళ్లిపై ఇంత ఓపెన్‌గా మాట్లాడిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?

ఈ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. దక్షిణాది సినీ పరిశ్రమలో అందం, అభినయం, సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen). కమర్షియల్ హీరోయిన్‌లా గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నటించి బహుభాషా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ నిత్యా మీనన్‌ను ఇతర హీరోయిన్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది.

Nithya Menen Opens Up on Marriage Love and Solo Life Actress Comments Go Viral

తెలుగులో అలా మొదలైంది (Ala Modalaindi)సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పలువురు హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే తమిళంలో విజయ్, సూర్య, ధనుష్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తన నటనతో ప్రశంసలు అందుకుంది.

ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని నిత్యా స్పష్టం చేశారు. "నేను జీవితంలో మంచి స్థాయికి ఎదిగాను. నాకు ఏమి చేయాలో మరెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. నాకు కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు. స్వేచ్ఛ లేకుండా నేను జీవించలేను" అని చెప్పింది.

ఇంకా మాట్లాడుతూ.. తన అమ్మమ్మ బ్రతికి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేదని గుర్తు చేసుకుంది. "నువ్వేమి చేస్తున్నావు? పెళ్లి చేసుకోకూడదా?" అంటూ తరచూ అడిగేదని తెలిపింది. అయితే ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేరని, ఆ తర్వాత ఈ విషయంలో ఇంట్లో ఎవరూ ఒత్తిడి చేయలేదని చెప్పింది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమేనని, దాన్నే అంతా అనుకోవాల్సిన అవసరం లేదని నిత్యా మీనన్ మరోసారి స్పష్టం చేసింది. "పెళ్లి జరిగితే మంచిదే.. జరగకపోయినా జీవితం ఆగిపోదు. ఎంతో మంది విజయవంతమైన వ్యక్తులు పెళ్లి లేకుండానే గొప్ప జీవితం గడిపారు. చివరికి మనిషి సంతోషంగా ఉండటమే ముఖ్యం" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ విషయానికొస్తే.. నిత్యా మీనన్ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: nithya menen marriage tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X