For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యమ హాట్‌గా నిత్యామీనన్.. ఎలా క్లాస్ పీకుతోందో చూడండి

|
Nithya Menen Latest Photoshoot Goes Viral || Filmibeat Telugu

'అలా మొదలైంది' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ కుట్టి నిత్యామీనన్. అలా అలా వరుస అవకాశాలు పట్టేసిన ఈ బొద్దుగుమ్మ ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా.. ఎక్కడా గ్లామర్ షోకి తావివ్వలేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఆమెకు అవకాశాలు కాస్త తగ్గాయి. అయితే తాజాగా ఓ ఫోటోషూట్ లో పాల్గొన్న నిత్యామీనన్ తనలో గ్లామర్‌కి కొదవ లేదని నిరూపించింది. అంతేకాదు వ్యక్తిగతంగా ఎవ్వరిని వారే ప్రేమించుకోవాలని పేర్కొంటూ వరుస సందేశాలు పోస్ట్ చేసింది.

టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్.. అందుకే

అందంతో పాటు టాలెంట్ పుష్కలంగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు నిత్యామీనన్. కానీ ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోవడం లేదు. హీరోయిన్ అన్నాక తన లోని గ్లామర్ అంతా ఒలకబోయాల్సిన పరిస్థితి. సో.. టాలెంట్ ఉన్నా అందాలు ఆరబోయడంలో కాస్త వెనకడుగేయటం మూలంగా నిత్యామీనన్ అవకాశాలు కాస్త సన్నగిల్లాయని చెప్పుకోవచ్చు.

రూటు మార్చుతున్నాని హింట్స్ ఇస్తోందా? లేక..

జనతా గ్యారేజ్, ఇష్క్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించినా ఆమెకు అవకాశాలు రాకపోవడం కారణంగా ఇక లాభం లేదని గ్లామర్‌పై దృష్టి సారించినట్లుంది నిత్యామీనన్. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలే అందుకు నిదర్శనం. తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని పిక్స్ షేర్ చేసిన నిత్యా.. మేలుకొలిపే సందేశాలు ఇవ్వడం విశేషం. అయితే ఈ పిక్స్ చూసిన జనం మాత్రం.. నిత్యా రూటు మార్చుతున్నానని హింట్స్ ఇస్తోందా? లేక మరేదైనా కారణం ఉందా? అని చర్చించుకుంటున్నారు.

బక్కచిక్కి గ్లామర్ డోస్ పెంచింది

సాధారణంగా గ్లామర్ ఫొటోలకు దూరంగా ఉండే నిత్యామీనన్ తాజాగా గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్‌లో పాల్గొనడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. రింగుల జుట్టు, ఆకట్టుకునే స్మైలింగ్ దానికి తోడు అందాల ఆరబోత అన్నీ కలగలిపి ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాకే వన్నె తెచ్చింది నిత్యామీనన్. పైగా ఈ ఫొటోల్లో ఆమె నాజూకు వయ్యారాలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి స్పెషల్ క్లాస్

గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేయడమే గాక సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి స్పెషల్ క్లాస్ తీసుకుంది నిత్యా. సమాజంలోని ప్రతీ దాన్ని అద్భుతమైనదిగా స్వీకరిస్తూ, సెల్ఫ్ రెస్పెక్ట్ పొందుతూ ఛాలెంజింగ్‌గా ముందుకెళ్లాలని నిత్యా పేర్కొంది. ప్రతి ఒక్కరూ తమను తాము ప్రేమించుకోవాలని, మీరు చేసిన తప్పులే మిమ్మల్ని మీరు పరిపూర్ణం చేయడంలో సోపానాలు అని తెలిపింది నిత్యా. ప్రస్తుతం తమిళంలో రెండు, హిందీలో ఒకటి, తెలుగులో మరో సినిమాకు కమిటై ఉంది నిత్యామీనన్.

English summary
Young and talented beauty Nithya Menen Posted Her Hot Photoshoot in Social Media. These pics are goes viral now. And Nitya says about self respect on this posts
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more