‘పెద్ద హీరోలతో నటిస్తే శూన్యమే.. నాకు ప్రతిసారి అలానే జరిగింది’
స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాలని పనిలేదు. ఆమె నటనతో, టాలెంట్ తో, రూప సౌందర్యంతో ఎప్పుడో దక్షిణాది ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే నిత్యా మీనన్ ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో పుల్ యాక్టివ్ గా కనిపిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో పెద్ద హీరోల చిత్రాల్లో నటించడంపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. నిత్యా మీనన్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
నిత్యా మీనన్ ఫ్యామిలీ వివరాలు..
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సుకుమార్ అండ్ నలిని దంపతులకు జన్మించింది నిత్యా మీనన్. ఆమె గ్రాండ్ పెరేంట్స్ కేరళకు చెందిన వారు. మలయాళీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంది. మరోవైపు ఆమె కెరీయర్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా సాగింది. దీంతో నిత్యా మీనన్ కు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ వంటి ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుతుంది. ఇక నిత్యా మీనన్ నటన రంగంలోనే కాకుండా సంగీత రంగలోనూ ప్రావీణ్యం దక్కించుకుంది. తను మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం కంప్లీట్ చేసుకుంది.

నిత్యా మీనన్ సినిమాలు..
బాలనటిగానే నిత్యామీనన్ తన కెరీయర్ ను ప్రారంభించింది. 1998లో ఫ్రెంచ్-ఇండియనఇంగ్లీష్ చిత్రం హనుమాన్ లో నటించింది. ఇక తొలుత కన్నడ చిత్రం 7 ఓ'క్లాక్ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 2011లో నాని సరసన అలా మొదలైంది.. చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఉత్తమ నటిగానూ అవార్డ్ అందుకుంది. అలాగే గుండె జారి గల్లంతయ్యిందే, ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు, రుద్రమదేవి, జనతా గ్యారేజీ, పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ లోనూ పవన్ స్టార్ సరసన నటించి మెప్పించింది.
పెద్ద హీరోల చిత్రాలపై కామెంట్స్..
నిత్యా మీనన్ తన అభిమానుల కోసం తరుచుగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది. తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక తాజాగా నిత్యా మీనన్ మాట్లాడుతూ తనకు పెద్ద హీరోల సినిమాల్లో నటించడం పెద్దగా ఫలితం అనిపించదని, ఎవరి సినిమాలోనో భాగమైనట్టుగానే ఉంటుందని చెప్పింది. ఆ సమయంలోనే తన కెరీయర్ లో మార్పులు చేసుకుంటూ వస్తున్నానని చెప్పింది. అందువల్లనే తన సినీ ప్రయాణంలో ముందుందని చెప్పే ప్రయత్నం చేసింది.
రాబోయే చిత్రాలు..
నిత్యా మీనన్ తెలుగులో చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. అలాగే ధనుష్ సరసన తిరు వంటి చిత్రాలతో అలరించింది. నెక్ట్స్ విజయ్ సేతుపతితో 'తలైవాన్ తలైవి', ధనుష్ సరసన ఇడ్లీ కడాయి వంటి చిత్రాలతో అలరించబోతోంది.


Click it and Unblock the Notifications











