పీరియడ్స్ అన్నా పట్టించుకోరు.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Nithya Menon: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ పాత్రల కంటే.. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు తన నటనతో జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇలా నేషనల్ వైడ్ గా ఫ్రేమ్ సంపాదించుకుంది. తాజాగా నిత్యామీనన్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
అసలేం జరిగిందంటే ?
నిత్యా మీనాన్.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలు అందుకుంటూ దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'అలా మొదలైంది' సినిమాతో నిత్యా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. తొలి సినిమా సక్సెస్ కావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో నటించి, మెప్పించింది నిత్యా మీనాన్.

ఇక , నిత్యామీనన్ కెరీర్ లో తిరుచిత్రంబలం, ఓ కాదల్ కన్మణి, మెర్సల్, ఇష్క్, ఇడ్లీ కడై, ఉస్తాద్ హోటల్, గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్, కాంచన 2 వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే..'తిరుచిత్రంబలం' సినిమాలో తన నటనకు నిత్యా మీనన్ జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. 'మిషన్ మంగళ్' చిత్రంలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తాజాగా నిత్యామీనన్ కాదలిక నేరమిల్లై సినిమాతో ముందుకు వస్తుంది. ఈ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాజివిట్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
కాదలిక నేరమిల్లై ప్రమోషన్స్ లో భాగంగా నిత్యా మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో లేడీ యాక్టరెస్ ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది. హీరోయిన్ల ఆరోగ్యం విషయంలో కొంతమంది మూవీ మేకర్స్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తారనీ, మహిళల బాధలను పట్టించుకోవడం లేదన్నారు. నా ఫ్రెండ్, డైరెక్టర్, యాక్టర్ మిస్కిన్ కు మాత్రం ఈ విషయంలో మినహాయింపు అని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు.

హీరోయిన్ల అనారోగ్యం విషయంలో, పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా కొంతమంది మూవీ మేకర్స్ పట్టించుకోరని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో చాలా చోట్ల అమానవీయత ఉంటుందని, ఎంత కష్టంలో ఉన్నా ఏదో ఒకటి చేసి షూటింగ్ కు రావాలని చెబుతారని నిత్యామీనన్ పేర్కొన్నారు. మనం దానికి అలవాటు పడాలని, ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలని తప్పదని నిత్యా వెల్లడించారు. నిత్యామీనన్ షూటింగ్ స్పాట్స్ లో తాను ఎన్నో ఇబ్బందికర విషయాలను పరిశీలించాలని, తాను కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











