నీ కౌగిలిలో బంధించి నలిపేయకు.. స్టేజ్‌పైనే టాప్ డైరెక్టర్‌కు షాకిచ్చిన నిత్యమీనన్
Nithya Menon: స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విభిన్న పాత్రలలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇటీవల తన నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇలా నేషనల్ వైడ్ గా ఫ్రేమ్ సంపాదించుకుంది నిత్యామీనన్ . తాజాగా అమ్మడుకు ఓ టాప్ డైరెక్టర్‌కు షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలేం జరిగిందో మీరు కూడా లుక్కేయండి.
నిత్యా మీనాన్ నటించింది. కొన్ని సినిమాలలోనైనా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. వరుస విజయాలను అందుకుంటూ
దక్షిణాది స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'అలా మొదలైంది' సినిమాతో నిత్య తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్య మీనన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని లాంటి స్టార్ హీరోల సరసన నటించిన సూపర్ హిట్స్ అందుకుంది. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో నటించి, మెప్పించింది.

నిత్యామీనన్ కెరీర్ లో తిరుచిత్రంబలం, ఓ కాదల్ కన్మణి, మెర్సల్, ఇష్క్, ఇడ్లీ కడై, ఉస్తాద్ హోటల్, గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, భీమ్లా నాయక్, కాంచన 2 సినిమాలు మంచి గుర్తింపు అందించాయి. ఇటీవల 'తిరుచిత్రంబలం' సినిమాలో తన నటనకుగాను నిత్యా మీనన్ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 2019లో నిత్యా మీనన్ 'మిషన్ మంగళ్' చిత్రంలో నటించింది బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, కీర్తి కుల్హారి, సోనాక్షి సిన్హా, సంజయ్ కపూర్ తదితరులతో స్కీన్ షేర్ చేసుకుంది.
ఇదిలాఉంటే.. నిత్యా మీనన్ అప్ కమ్మింగ్ మూవీ కాదలిక నేరమిల్లై. ఈ సినిమాకు ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ దర్శకత్వం వహించారు. 'కాదలిక నేరమిల్లై' సినిమా జనవరి 14న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ యూనిట్స్ ప్రమోషన్ ఈవెంట్స్ లో బిజీబిజీగా మారింది. ఈ క్రమంలో మంగళవారం నాడు 'కాదలిక నేరమిల్లై' ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు జయం రవి, ఎఆర్ రెహమాన్, అనిరుధ్ రవిచందర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు డైరెక్టర్, నటుడు మిస్కిన్ కూడా హాజరయ్యారు. ఈ సమయంలో డైరెక్టర్ మీస్కిన్, హీరోయిన్ నిత్యమీనన్ మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ మిస్కిన్ కు హీరోయిన్ నిత్యామీనన్ స్వాగతం పలుకుతుంది. ఈ సమయంలో అతడు నిత్యాను హగ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ, నిత్య అందుకు నిరాకరిస్తూ.. నన్ను పిండకండి. నన్ను మీరు గట్టిగా కౌగిలించుకోకండి. నేను ప్రోగ్రాం కోసం రెడీ అయి వచ్చాను' అంటూ చమత్కరిస్తుంది. ఆ తర్వాత నిత్యామీననే డైరెక్టర్ ను కిస్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. మిస్కిన్ కూడా ఒక నటుడు. ఆయన విజయ్ 'లియో', శివకార్తికేయన్ 'మావీరన్' వంటి చిత్రాల్లో నటించారు. ఆయన విజయ్ సేతుపతి అప్ కామింగ్ మూవీ 'డ్రాగన్'లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 'కాదలిక్క నేరమిల్లై' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటి నిత్యా మీనన్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక 'కాదలిక నేరమిల్లై ' కథ విషయానికి వస్తే.. బాస్ కుమార్తెను ప్రేమించిన వ్యక్తి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ వ్యక్తి..తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చేసే ప్రయాత్నాలు.. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన స్నేహితుడిని తన తండ్రిగా నటించమని ఒప్పిస్తాడు. ఇది హాస్యాస్పదమైన అపార్థాలకు దారితీస్తుంది. ఈ చిత్రంలో జయం రవి, యోగి బాబు, నిత్యా మీనన్, వినయ్ రాయ్, టిజె భాను, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, జాన్ కొక్కెన్, వినోదిని వైద్యనాథన్, సింగ్ రోహన్ కీలక పాత్రల్లో నటించారు. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించింది. ఈ చిత్రం జనవరి 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











