మలయాళం స్టార్ హీరో‌తో పెళ్లి.. తేల్చి పడేసిన నిత్య మీనన్

ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్ ఇటీవల తరుచుగా వార్లల్లో వ్యక్తిగా మారిపోయారు.ఇటీవల జాతీయ అావార్డు అందుకొన్న ఆమె వివాదాస్పద అంశాలపై స్పందించారు. అలాగే తాజాగా ఆమె పెళ్లి గురించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలపై వివరణ ఇచ్చారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

ధనుష్‌తో కలిసి నటించిన తమిళ సినిమాలోని నటనకు గాను నిత్య మీనన్ జాతీయ ఉత్తమ అవార్డును అందుకొన్నారు. అయితే ఆమెకు అవార్డు రావడంపై సాయిపల్లవి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. గార్గి సినిమాలోని ఫెర్ఫార్మెన్స్‌కు సాయిపల్లవికి అవార్డు రావాల్సిందని ట్రోల్ చేస్తే.. ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎవరెవరో ఏదో అంటుంటారు. కానీ ప్రతీదానికి సమాధానం చెప్పలేం కదా అని ఆ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నంచారు.

Nithya Menon clarity on Marriage rumours and Gossips with Star hero in Media

ఇటీవల ఆమె మాట్లాడుతూ.. నా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంపై ఎవరూ కూడా నాపై అధిపత్యం చేయడం నాకు నచ్చదు. నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. నేను పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. ఆ విషయంలో నన్ను ప్రశ్నిస్తే నేను ఒప్పుకోను అని నిత్య మీనన్ అన్నారు.

నాపై వచ్చే రూమర్లు, గాసిప్స్‌ను పట్టించుకోను. ఇటీవల నేను మలయాళ హీరోను పెళ్లి చేసుకొంటున్నట్టు వార్తలు వచ్చాయి. అందంతా ఫేక్ న్యూస్, అలాంటి వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. నేను పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలనేది నా ఇష్టం. అంతేగానీ ఎవరో రాస్తే నేను చేసుకొంటానా? అని అన్నారు.

Nithya Menon clarity on Marriage rumours and Gossips with Star hero in Media

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తల్లిదండ్రులు నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదు. ఏ విషయంలోనైనా నన్ను నా పేరెంట్స్ పూర్తిగా స్వేచ్చనిస్తారు. వారి నమ్మకాన్ని నేను ఎప్పుడూ దెబ్బ తీయను. నా పరిధిలో నేను జీవితాన్ని ఆస్వాదిస్తుంటాను అని నిత్య మీనన్ తెలిపారు.

కెరీర్ విషయానికి వస్తే.. నిత్య మీనన్ ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ నిర్మించే ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. జయం రవితో కలిసి ఆమె ఈ మూవీలో కనిపిస్తారు. ఈ సినిమాకు కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు, వినయ్ రాయ్, జాన్ కోక్కెన్, లాల్ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X