twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో నటితో నిత్యమీనన్ గాఢంగా లిప్‌లాక్.. వివాదాస్పదంగా లెస్పియన్ కిస్ సీన్ (ఫోటోస్)

    |

    దక్షిణాది చిత్రసీమలో అత్యంత ప్రతిభావంతురాలైన హీరోయిన్లలో నిత్యా మీనన్‌ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి పాత్రకైనా నూటికి నూరుశాతం న్యాయం చేస్తారు. తాజాగా దక్షిణాది సినిమాలకు మెల్లమెల్లగా దూరమైనట్టు కనిపిస్తూ బాలీవుడ్‌కు దగ్గరవుతుందా అనే అనుమానం కనిపిస్తున్నది.

    మిషన్ మంగళ్ చిత్రంతో

    మిషన్ మంగళ్ చిత్రంతో

    గతేడాది బాలీవుడ్‌లో మిషన్ మంగళ్ చిత్రంతో అడుగుపెట్టిన నిత్యా మీనన్ తాజాగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి బ్రీత్: ఇంటూ ది షాడోస్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. అయితే ఇందులో లెస్పియన్ పాత్రలో ఆమె కనిపించి నటించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక బ్రీత్ సినిమాలో నిత్య మీనన్ సీన్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి..

    బ్రీత్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో

    బ్రీత్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లో

    బ్రీత్: ఇంటూ ది షాడోస్ వెబ్ సీరీస్‌లో డాక్టర్ అవినాష్ సభర్వాల్‌గా అభిషేక్, ఆయన భార్య అభా పాత్రలో నిత్యమీనన్ నటించారు. బర్త్ డే పార్టీ రోజున ఆరేళ్ల కూతురు సియా (ఇవానా కపూర్) అనూహ్యం అదృశ్యం కావడం, చిన్నారి కోసం వెతుకులాట నేపథ్యంగా కథ సాగుతుంది. అయితే బ్రీత్ సీజన్ 1‌కు వచ్చిన ఆదరణ బ్రీత్ సీజన్ 2‌కు ప్రేక్షకుల నుంచి కనిపించకపోవడం గమనార్హం.

     లెస్బియన్ పాత్రలో నిత్య మీనన్

    లెస్బియన్ పాత్రలో నిత్య మీనన్

    ఇదిలా ఉండగా, బ్రీత్‌లో నిత్యమీనన్ ధరించిన లెస్బియన్ పాత్ర ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. మరో నటితో కలిసి హాట్‌హాట్ సీన్లలో రెచ్చిపోవడంపై అభిమానులు షాకవుతున్నారు. ఇంత ఘాటైన రొమాంటిక్ సీన్‌లో నిత్య నటించడమేమిటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సీన్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

     గాఢమైన ముద్దు సీన్‌లో

    గాఢమైన ముద్దు సీన్‌లో

    బ్రీత్ వెబ్ సిరీస్‌లో కారులో మరో నటితో కలిసి లిప్‌లాక్ సీన్ చేసింది. గాఢమైనమైన ముద్దు సీన్‌లో మరో నటితో లీనమై నటించిందనే కామెంట్ వినిపించింది. ఈ లిప్‌లాక్ సీన్‌‌తోపాటు ఓ రొమాంటిక్ సీన్‌లో హాట్ హాట్‌గా నటించారు. అయితే కథలో భాగంగా రావడంతో నిత్య పెర్ఫార్మెన్స్ జస్టిఫికేషన్ లభించింది. అయితే బ్రీత్ సీజన్ 2 వెబ్ సిరీస్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. నిత్య, అభిషేక్ పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

    బ్రీత్ పాత్ర గురించి నిత్య మీనన్

    బ్రీత్ పాత్ర గురించి నిత్య మీనన్

    బ్రీత్ సినిమాలో తన పాత్రను పోషించుకోవడంపై నిత్యామీనన్ తనకు తాను ప్రశంసించుకొన్నారు. ఒక డిఫరెంట్ తల్లి పాత్రను పోషిస్తున్నాను. బ్రీత్ ఓ సైకాలజికల్ థ్రిల్లర్. ప్రతీ ఒక్కరికి నా పాత్ర కనెక్ట్ అవుతుందని ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించారు. థియేటర్‌లో సినిమా చూడటమనే అనుభూతిని ఓటీటీ రిప్లేస్ చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    English summary
    Bollywood Hero Abhishek Bachchan grand digital debut with Breathe: Into The Shadows. Nitya Menon also making her debut in hindi web series, This web series releasedon July 10th. Apart from this, Nitya Menen liplock seen goes viral. She acted as Lesbian in some part of the portion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X