సమంత, నయనతార, అనుష్క మాదిరిగా కమిట్‌మెంట్ లేదు.. యాక్టింగ్‌పై ఆధారపడను.. నివేదా పేతురాజ్
యువ హీరో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించి.. నిర్మాతగా నిర్మించిన తొలి పాన్ ఇండియా చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌కు జంటగా నివేదా పేతురాజ్ నటించింది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ట్రెండింగ్ అవుతున్నాయి. టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. మార్చి 22 తేదీన ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నప్పుడు
అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఆయన నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి జీవితం కూడా సరిపోదు. షూటింగ్ సమయంలో మేమంత ఓ విషయం గురించి మాట్లాడుతుంటే.. వేల సంవత్సరాల క్రితం ఉన్న చరిత్రను చెబుతూనే ఉన్నారు. అలాంటి చరిత్రను ఎంత చదివితే.. అలాంటి నాలెడ్జ్ వస్తుందో అనే విషయం నాకు అర్ధం కాలేదు అని నివేద పేతురాజ్ అన్నారు

సెకండ్ హీరోయిన్‌గా చేయడంపై
అలా వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్‌గా చేయడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయవద్దని చాలా మంది చెప్పారు. అలా వైకుంఠపురంలో సినిమాలో నటించడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. అలాంటి భారీ తారాగణంతో నటించడం నాకు బాగా ప్లస్ అయింది. అయితే మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర వస్తే.. ఎవరు చెప్పినా వినను. పాత్రలను ఎంచుకోవడంలో సాయిపల్లవిని నేను ఆరాధిస్తాను. ఫిదా, లవ్ స్టోరి, విరాటపర్వం సినిమాల్లో ఆమె నటన అద్బుతం.

యాక్టింగ్‌కు డెడికేట్ చేయలేదు
నా టాలెంట్‌కు, నేను చేసిన సినిమాల తర్వాత నాకు రావాల్సిన స్టార్ డమ్ రాలేదని అందరూ అంటుంటారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలు హిట్ అయ్యాయి. నాకు రావాల్సిన పేరు రాలేదు. కానీ అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. సమంత, నయనతార, అనుష్క కెరీర్ కోసం వారు లైఫ్‌ను డెడికేట్ చేశారు. వారి మాదిరిగా నేను నా లైఫ్‌ను యాక్టింగ్‌కు డెడికేట్ చేయలేదు, ఫ్రొఫెషన్‌కు పూర్తి కమిట్‌మెంట్‌తో లేను. యాక్టింగ్‌తోపాటు బిజినెస్‌ను కూడా చేస్తున్నాను. యాక్టింగ్ అనేది చాలా డిమాండ్ ఉన్న జాబ్. నేను కేవలం యాక్టింగ్ మీదే ఆధారపడి ఉండలేను అని నివేదా పేతురాజ్ చెప్పారు.

నిర్మాతలు చాలా ఇబ్బందులకు
నిర్మాతల కష్టాలు, బాధల గురించి పెద్దగా తెలియదు. కానీ అప్పుడప్పుడు వారి గురించి వింటూ ఉంటాను. కోవిడ్ తర్వాత నిర్మాతలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. 10 శాతం వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి.. సినిమాలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. బడ్జెట్‌ను మంచి సినిమాకు ఖర్చు పెట్టకూడదు అని అన్నారు.

భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తా
నేను నిర్మాతగా మారే అవకాశం లేదు. అయితే ఓ కథ నా వద్దకు వచ్చినప్పుడు.. 2, 3 కోట్లు అయితే నేను చేస్తానని చెప్పాను. కానీ వెంటనే మా అమ్మ.. జాతకం చూసి 20 నిమిషాల నోట్ పెట్టారు. సినిమాలు నిర్మించవద్దని బలంగా చెప్పారు. ప్రొడక్షన్ నేను చేయను గానీ.. భవిష్యత్‌లో నేను సినిమాను డైరెక్ట్ చేస్తాను. నిర్మాతల కష్టాలు నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను. నేను జాతకాలు పెద్దగా పట్టించుకోను. కానీ నిర్మాత మారే విషయంలో మా అమ్మ చెప్పిన జాతకాన్ని నమ్ముతాను అని నివేదా పేతురాజ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











