లక్కీ ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్.. ఏకంగా బన్నీ ఒడిలో!

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి లక్కు కూడా తోడు కావాల్సిందే. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికొస్తే ఇది అక్షర సత్యం. కొందరు హీరోయిన్స్ ఎంతో కష్టపడి అభినయంతో పాటు అందాన్ని ఆరబోసినా దక్కని అవకాశం.. కొందరు హీరోయిన్స్‌కి ఇట్టే వరిస్తుంది. ఈ లిస్ట్ లో తాజాగా యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పేరు కూడా ఎక్కేసింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. ఈ చిత్ర కథా పరంగా ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండటంతో ఇప్పటికే ఈ సినిమాలో మొదటి హీరోయిన్‌గా పూజా హెగ్డే సెలెక్ట్ కాగా రెండో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ ని ఫైనల్ చేశారు త్రివిక్రమ్. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

Nivetha Pethuraj Confirmed in Allu Arjun- Trivikram Project

ఇటీవలే త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో తాను కూడా నటిస్తున్నానని ప్రకటించాడు హీరో సుశాంత్. దీంతో చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉండనుందా అనే ఆసక్తి మొదలైంది ప్రేక్షకుల్లో. ఆ ఆసక్తిని తెరదించుతూ తాజాగా నివేదా పేతురాజ్ పేరు బయటకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో కూడా ఆమె పాలు పంచుకుంటోంది. అల్లు అర్జున్ 19వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా భాగమవుతుండటం విశేషం. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు అంటే ఇక త్రివిక్రమ్ మ్యాజిక్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

టాలీవుడ్‌లో నివేదా పేతురాజ్ తొలి సినిమా 'చిత్రలహరి'. సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ నటన అబ్బురపరిచింది. దీంతో రెండవ సినిమా లోనే త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటించే అదృష్టం ఆమెను వరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X