చిక్కుల్లో హీరోయిన్... ఆలయంలో ఆ పని చేయడం వల్లే!
Recommended Video

'మెంటల్ మదిలో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో 'చిత్ర లహరి', శ్రీవిష్ణుతో 'బ్రోచేవారెవరురా' చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ నివేథా పేతురాజ్ వివాదంలో ఇరుక్కుంది. మదురైలోని మీనాక్షి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడమే అందుకు కారణం.
మదురై మీనాక్షి ఆలయంలో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ... మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ తీర్పు ఇచ్చింది. కోర్టు సూచనల మేరకు నిర్వహణ అధికారులు ఫిబ్రవరి 2018 నుంచి ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్లవాడకాన్ని నిషేధించారు.

నిబంధనలు పాటించని నివేథా పేతురాజ్
ఇటీవల తన స్నేహితురాలితో కలిసి మదురై మీనాక్షి ఆలయాన్ని సందర్శించిన నివేథా పేతురాజ్...అక్కడ తన సెల్ ఫోన్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోటోలతో పాటు కొన్ని వీడియోలు సైతం పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎలా అనుమతించారు?
ఆమె సోషల్ మీడియా పేజీలో ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేయగానే... నిబంధనలు పాటించకుండా సెల్ ఫోన్ ఎలా వాడారు? అక్కడ వాటిపై నిషేధం ఉన్న విషయం మీకు తెలియదా? అంటూ ఆమె ఫాలోవర్స్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. సామాన్య భక్తుల సెల్ ఫోన్లు అనుమతించని అధికారులు ఇలా సెలబ్రిటీల విషయంలో నిబంధనలు పాటించకుండా ద్వంధ్వ వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ పలువురు మండి పడ్డారు.

వెంటనే తొలగించిన నివేథా పేతురాజ్
అసలు విషయం తెలియ ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన నివేథా పేతురాజ్... ఇది పెద్ద వివాదం కాకముందే వాటిని తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించింది.

నివేథా పేతురాజ్
నివేథా పేతురాజ్ సినిమాల విషయానికొస్తే... 2019 సంవత్సరంలో ఆమె నటించిన సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. నాలుగు తమిళ సినిమాలతో పాటు తెలుగులో ‘చిత్రలహరి', ‘బ్రోచేవారెవరురా' చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











