నిర్మాతలకు హీరోయిన్ ఓపెన్ ఆఫర్... ప్రియుడి చేతిలో మోసంతో షాకింగ్ డెసిషన్

జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిన్నటి వరకు పూలు పడిన చోట రాళ్లు పడొచ్చు.. వైభవంగా బతికిన చోట ఎలాంటి గౌరవం దక్కకపోవచ్చు. సామాన్యులే కాదు.. ప్రముఖులకు కూడా ఇలాంటి పరిస్ధితి ఎదురవుతుంది. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది... ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అవకాశాల కోసం వెతుక్కుంటోంది ఓ నటి. ఆఫర్ల కోసం ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఆ నటి ఎవరు? ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటీ? అనేది పరిశీలిస్తే..

Also Read
Rakasa Day 12 Collections: రాకాస బాక్సాఫీస్ రిపోర్ట్.. నిహారిక మూవీకి 12వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Rakasa Day 12 Collections: రాకాస బాక్సాఫీస్ రిపోర్ట్.. నిహారిక మూవీకి 12వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నివేదా పేతురాజ్. తమిళనాడులోని మధురైకి చెందిన నివేదా పెతురాజ్. దుబాయ్‌, లండన్‌లలో చదువుకున్న ఈ ముద్దుగుమ్మ.. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించారు. మిస్ ఇండియా యూఏఈ పోటీలలో విజయం సాధించి.. తర్వాత మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2015 పోటీలలో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించారు. 2016లో ఓరు నాల్ కూతు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు నివేదా పేతురాజ్. 2017లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగువారిని పలకరించారు.

Nivetha Pethuraj Plans Second Innings in Cinema after Breaks Up With Dubai Boyfriend Rajhith Ibran

చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, రెడ్, పాగల్, బ్లడ్ మేరి, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ, బూ సినిమాలలో నటించారు. నివేదా థామస్ మల్టీటాలెంటెడ్ ఈమెలో ఓ యాక్టర్ మాత్రమే కాదు.. ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్, రేసర్ కూడా ఉన్నారు. పలు పోటీలలో పాల్గొని ఎన్నో అవార్డుల్ని ఆమె అందుకున్నారు. ఫార్ములా కార్ రేస్ ట్రైనింగ్ లెవల్ 1ని పూర్తి చేసింది. సినిమాలు, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ తనకు వీలు కుదిరనప్పుడల్లా కారు రేసుల్లో పాల్గొంటోంది.

Recommended For You
పెళ్లయిన యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుట్టబొమ్మ
పెళ్లయిన యంగ్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుట్టబొమ్మ

దుబాయ్‌కి చెందిన రజిత్ ఇబ్రాన్‌తో ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ గతేడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. కొత్త ఏడాదిలో రజిత్‌ను పెళ్లాడబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది. రజిత్‌తో కలిసున్న ఫోటోలను నివేదా డిలీట్ చేయడంతో పాటు ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. రజిత్‌తో ప్రేమ నేపథ్యంలో అతని కోసం బంగారం లాంటి కెరీర్‌ను సైతం పక్కనపెట్టింది, మంచి ఆఫర్లను కూడా నివేదా వదిలేసుకుందని టాక్. అయితే ఇప్పుడు దుబాయ్ ప్రియుడు మోసం చేయడంతో తిరిగి చెన్నైలో ల్యాండ్ అయ్యింది నివేదా పేతురాజ్.

You May Also Like
బాడీగార్డ్స్ ముందే నా నడుము గిల్లిన తుంటరి.. వాడికి అలా బుద్ధి చెప్పా... బిగ్‌బాస్ దివి
బాడీగార్డ్స్ ముందే నా నడుము గిల్లిన తుంటరి.. వాడికి అలా బుద్ధి చెప్పా... బిగ్‌బాస్ దివి

తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేయాలని నివేదా పేతురాజ్ భావిస్తున్నారట. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. హాట్ హాట్ ఫోటోలు వదలడంతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇతర ఈవెంట్స్‌తో నిత్యం వార్తల్లో ఉంటూ మేకర్స్ కళ్లలో పడేందుకు ప్రయత్నిస్తోందట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండస్ట్రీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నివేదా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ రోల్స్ అయినా చేస్తానని, లేదంటే ప్రాధాన్యత గల మరేదైనా పాత్ర అయినా ఓకేనని నివేదా ఓపెన్‌గా చెబుతున్నారట. మరి నివేదాకు అవకాశాలు దొరుకుతాయా? తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: nivetha pethuraj movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X