పాత్ర డిమాండ్ చేస్తే అందుకు సిద్దమే.. నివేదా కామెంట్స్

తమిళ నాట మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ నివేదా పేతురాజ్. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ బిజీగా మారింది. వరుసగా సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతోంది. అందం, అదృష్టం, ప్రతిభ ఈ మూడు ఉండటంతో కోలీవుడ్‌లో ప్రస్తుతం నివేదాకు బోలెడన్నీ అవకాశాలు వెదుక్కుంటు వస్తున్నాయి. ఇదే సమయంలో నివేదా టాలీవుడ్ పైనా కన్నేసింది. ఈ మేరకు టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్లలో పడేందుకు నానారకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగులోనూ ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసినా మంచి నటనను కనబర్చి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా రీసెంట్‌గా అల వైకుంఠపురములో సినిమాలోనూ అందంగా కనిపించి, నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఇలా నివేదా నటించిన సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన నివేదా బోల్డ్ కామెంట్స్ చేసింది.

Nivetha Pethuraj Ready To Exposing On Screen

నివేదా మాట్లాడుతూ .. 'తమిళంలో నేను ఇంతవరకూ చేసిన పాత్రల కారణంగా గ్లామరస్ గా కనిపించవలసిన అవసరం ఏర్పడలేదు. ఇక తెలుగులోను 'అల వైకుంఠపురములో' వరకూ నేను గ్లామరస్ గా కనిపించలేదు. త్రివిక్రమ్ గారు నన్ను చాలా గ్లామరస్ గా చూపించారు. పాత్రకి ఆవరసం అనుకుంటే అందాలు ఆరబోయడానికి నేను సిద్ధంగానే వున్నాను. అలా అని చెప్పేసి అందాలు ఆరబోస్తేనే అవకాశాలు వస్తాయని నమ్మే వ్యక్తిని కాదు నేను. పాత్రకి తగినట్ట్టుగా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేద'ని దర్శక నిర్మాతలకు ఆఫర్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X