బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు... అల్లు అర్జున్ హీరోయిన్ ఫస్ట్ రియాక్షన్

భారతీయ సినీ రంగానికి చెందిన పలువురు నటీనటులు విడాకుల బంధానికి చెక్ పెట్టి.. వైవాహిక బంధం ద్వారా ఒక్కటి అవుతుంటే కొందరు మాత్రం అర్ధాంతరంగా పీటల మీద పెళ్లిని ఆపుకుంటున్నారు. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని రేపు మాపో పెళ్లి చేసుకుని ఒక్కటవుతున్నారు. కానీ కొందరు మాత్రం పీటల మీద పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. గతేడాది ఓ తమిళ హీరోయిన్ నివేదా పేతురాజ్ తన దుబాయ్ ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకోవడం షాకిచ్చింది. తాజాగా సింగ్ గీతం మూవీలో నటించిన నివేదా.. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో నివేదా పేతురాజ్ తన బ్రేకప్‌పై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

నివేదా పేతురాజ్ తొలుత మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించారు. మిస్ ఇండియా యూఏఈ కిరీటం సాధించిన ఆమె అనంతరం మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2015 పోటీలలో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించారు. నివేదా థామస్ మల్టీటాలెంటెడ్ ఈమెలో ఓ యాక్టర్ మాత్రమే కాదు.. ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్, రేసర్ కూడా ఉన్నారు. పలు పోటీలలో పాల్గొని ఎన్నో అవార్డుల్ని ఆమె అందుకున్నారు. ఫార్ములా కార్ రేస్ ట్రైనింగ్ లెవల్ 1ని పూర్తి చేసింది. సినిమాలు, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ తనకు వీలు కుదిరనప్పుడల్లా కారు రేసుల్లో పాల్గొంటోంది.

Nivetha Pethuraj s indirect comments About Her Breakup at sing geetham success celebrations

2016లో ఓరు నాల్ కూతు వెండితెరపై అడుగుపెట్టారు నివేదా పేతురాజ్. 2017లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అనంతరం చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, రెడ్, పాగల్, బ్లడ్ మేరి, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ, బూ సినిమాలలో నటించారు. తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నప్పటికీ, తెలుగులో మాత్రం సెకండ్ హీరోయిన్‌గానే నెట్టుకొస్తున్నారు.

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమలో పడి కొన్నాళ్లు సినిమాలకు దూరమై అభిమానులకు షాకిచ్చారు నివేదా. దుబాయ్‌కి చెందిన రజిత్ ఇబ్రాన్‌తో ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. గతేడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. కొత్త ఏడాదిలో రజిత్‌ను పెళ్లాడబోతున్నట్లు తెలిపింది. త్వరలో పెళ్లి అనుకుంటుండగా ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట అనూహ్యంగా విడిపోయింది. రజిత్‌తో కలిసున్న ఫోటోలను నివేదా డిలీట్ చేసింది. అలాగే నివేవా, రజిత్‌లు ఒకొరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు.

రజిత్‌తో ప్రేమాయణం నివేదా పేతురాజ్‌ కెరీర్‌పైనా తీవ్ర ప్రభావం చూపించిందని విశ్లేషకులు అంటారు. పెళ్లి చేసుకోబోతున్నాననే ఉద్దేశంతో మంచి ఆఫర్లను కూడా నివేదా వదిలేసుకుందని టాక్. అయితే ఇప్పుడు పెళ్లి ఆగిపోవడంతో తిరిగి భారతదేశానికి చేరుకుని ఆఫర్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సింగ్ గీతం మూవీలో ఆమె కీలకపాత్ర పోషించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి- బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా 158లోనూ ఆమె నటిస్తున్నారు.

సింగ్ గీతం మూవీ సక్సెస్‌మీట్‌లో నివేదా పేతురాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 2023లో సినిమాలను వదిలేయాలని డిసైడ్ అయ్యాను. కానీ దానికి ఎంతో పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నాను. జీవితంలో అప్పుడప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. నేను కూడా అన్ని తప్పులు చేసి, అటు తిరిగి ఇటు తిరిగి సింగీతం శ్రీనివాసరావు బ్లాక్‌బస్టర్ మూవీలో లాండ్ అయ్యాను. నన్ను ఈ సినిమా జీవితంలోకి తిరిగి తీసుకొచ్చిన నాగీకి థ్యాంక్స్. ఆయన కనుక లేకపోతే ఏ హిమాలయాల్లోనో ధ్యానం చేసుకుంటూ జీవితాన్ని సాగించే దానిని అని నివేదా అన్నారు.

సింగ్ గీతం మూవీని నిన్ననే చూశాను.. చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్.. ఆయన సినిమాని సంక్రాంతికి చూడటానికి వెయిట్ చేస్తున్నాను. లండన్‌లో ఎన్నో మ్యూజిక్ కన్సర్ట్‌లను చూశాను. కానీ నేను మ్యూజికల్ ఫిల్మ్‌లో భాగమవుతానని అనుకోలేదు. సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకులకే దర్శకుడు అని నివేదా ప్రశంసించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివేదా తీసుకున్న రాంగ్ డెసిషన్ పెళ్లి గురించేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: nivetha pethuraj Sing Geetham
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X