అదంతా పట్టించుకోను.. అలా కనిపించేందుకు రెడీ.. నివేదా పేతురాజ్

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి లక్కు కూడా తోడు కావాల్సిందే. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికొస్తే ఇది అక్షర సత్యం. కొందరు హీరోయిన్స్ ఎంతో కష్టపడి అభినయంతో పాటు అందాన్ని ఆరబోసినా దక్కని అవకాశం.. కొందరు హీరోయిన్స్‌కి ఇట్టే వరిస్తుంది. ఈ లిస్ట్‌లో తాజాగా యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పేరు కూడా ఎక్కేసింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో.. చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. ఈ చిత్ర కథా పరంగా ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండటంతో మొదటి హీరోయిన్‌గా పూజా హెగ్డేయె తీసుకొని రెండో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ని కన్ఫర్మ్ చేశారు. సీనియర్ నటి టబు కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Nivetha Pethuraj Says Yes to Glamour Roles

గతంలో చిత్రలహరి, బ్రోచేవారెవరురా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది నివేదా పేతురాజ్. కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్ జోలికి వెళ్లని నివేదా.. ఇప్పుడు గ్లామరస్ పాత్రలకు కూడా సై అంటోంది. గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని చెబుతోంది. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది నివేదా.

వెండితెరపై అలా నటించాలి.. ఇలా నటించాలి అని నియమాలేం పెట్టుకోలేదు. కథకు అవసరమైతే గ్లామరస్‌గా కనిపించడానికి నేను రెడీ అంటోంది నివేదా పేతురాజ్. అల వైకుంఠపురములో.. తనది గ్లామరస్‌ రోలే అని వెల్లడించింది నివేద. తమిళంలో, తెలుగులో ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించే అవసరం రాలేదని.. వస్తే కాదనేది లేదని ఈ సందర్బంగా పేర్కొంది నివేదా పేతురాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X